OTT Movie: కుర్రాళ్లు రెడీనా! ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి మరీ చూశారు. సాధారణ ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది.

ట్యాటెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్. కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి మరో కీలక పాత్రలో నటించింది. పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ డ్యూడ్ సినిమాను నిర్మించడం విశేషం. దసరా కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో చాలా చోట్ల ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. అదే సమయంలో మూవీ లవర్స్ డ్యూడ్ సినిమాను ఓటీటీలో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీరి నిరీక్షణకు తెరపడనుంది. డ్యూడ్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే చిల్ట్రన్స్ డే కానుకగా నవంబర్ 14 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి డ్యూడ్ సినిమా స్ట్రీమింగ్ కు కానున్నట్లు టాక్ . త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.
డ్యూడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడపోయాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం నెట్ ఫ్లిక్స్ దర్శక నిర్మాతలకు రూ.25 కోట్లకు పైగానే చెల్లించినట్లు తెలుస్తోంది. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఈ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడమంటే విశేషమనే చెప్పుకోవాలి. ఇక డ్యూడ్ సినిమాలో ఆర్ శరత్ కుమార్, రోహిణీ, ఐశ్వర్య శర్మ, వినోదిని వైద్యనాథన్, హ్రిదూ హిరోన్, సత్య, బీసెంట్ రవి తదతరులు కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
నవంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో డ్యూడ్ సినిమా..
#Dude expected to stream from Nov 14 on NETFLIX. pic.twitter.com/8Bb6Oi1yQa
— Christopher Kanagaraj (@Chrissuccess) November 3, 2025
Finally : #Dude Official HD ✅🔥
November 14th – Netflix 🍿 4K UHD & Tamil + Multi 🔊 pic.twitter.com/U58OPwMNVE
— Տri Bobby (@Bobby__Sri) November 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








