AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో మరో రియల్ క్రైమ్ స్టోరీ.. బిహార్ రాజకీయాలను కళ్లకు కట్టినట్టు చూపించే సినిమా

ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ బిహార్ ఎలక్షన్ల చుట్టే తిరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ లో జరిగిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఓ సినిమా ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. రికార్డు వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది.

OTT Movie: ఓటీటీలో మరో రియల్ క్రైమ్ స్టోరీ.. బిహార్ రాజకీయాలను కళ్లకు కట్టినట్టు చూపించే సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 03, 2025 | 8:22 PM

Share

ఈ మధ్యన ప్రముఖ వ్యక్తులు, కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో ఈ రియాల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. బిహార్ లోని రాజకీయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ లో దూసుకెళ్లుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మూహమ్మద్ షాహాబుద్దీన్ జీవిత కథ (సివాన్ మాజీ MP) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హారూన్ షా అలీ బేగ్ అనే వ్యక్తి జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘సాహెబ్’ అని పిలవబడే ఈ గ్యాంగ్‌స్టర్, వీధి రౌడీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ గా మారతాడు. అదే సమయంలో ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ సాహెబ్ ను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. అతన్ని అరెస్టు చేయడానికి సరైన ఆధారాలు ఒక్కటి కూడా అతని వద్ద ఉండవు. మరి హరూన్ పొలిటికల్ లీడర్ గా తర్వాత తన ప్రత్యర్థులను ఏం చేశాడు? ప్రజల్లో ఎలాంటి భయోత్పతాన్ని సృష్టించాడో ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ఆద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ‘రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్’. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీలో ఉత్తర ప్రదేవ్, రాజస్థాన్ ఛాప్టర్ లు వెబ్ సిరీస్ గా వచ్చాయి. బిహార్ ఛాప్టర్ కూడా సిరీస్ గా వచ్చింది. అయితే ఇప్పుడు దీనిని సినిమాగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ సినిమా రన్ టైమ్ సుమారు రెండు గంటలు (120 నిమిషాలు). మంచి పొలిటిలక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. తెలుగు వెర్షన  అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5లో స్ట్రీమింగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ