OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. డ్యూడ్‌తో సహా మొత్తం 20కు పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్
ఓటీటీలో దీపావళి సందడి మళ్లీ మొదలు కానుంది. అదేనండి ఈ దీపావళికి థియేటర్లలో విడుదలైన సూపర్ హిట్ సినిమాలన్నీ ఈ శుక్రవారం (నవంబర్ 14)న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. డ్యూడ్, తెలుసు కదా, కే- ర్యాంప్ సినిమాలతో పాటు మొత్తం 20కు పైగా చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

ఈ శుక్రవారం (నవంబర్ 14) థియేటర్లలో ఓ మోస్తరు సినిమాలే రిలీజ్ కానున్నాయి. తెలుగుతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. తెలుగు నుంచి సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రిస్ వస్తుండగా.. దుల్కర్ సల్మాన్, రానా నటించిన డబ్బింగ్ మూవీ కాంత కూడా థియేటర్లలో సందడి చేయనుంది. వీటిలో కాంత, సంతాన ప్రాప్తిరస్తు సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. డ్యూడ్, తెలుసు కదా, కే-ర్యాంప్ (నవంబర్ 15) తో పాటు పలు కొత్త సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అక్షయ్ కుమార్ లేటెస్ట్ సినిమా జాలీ ఎల్‌ఎల్‌బీ-3 కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ వీకెండ్ లో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..
- తెలుసు కదా(తెలుగు సినిమా)
- డ్యూడ్ (తెలుగు సినిమా)
- ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లిష్ సినిమా)
- జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లిష్ సినిమా)
- నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ సినిమా)
- లెఫ్టర్- ది స్టోరీ ఆఫ్ ది ఆర్డినరీస్(హాలీవుడ్ సినిమా)
- ది క్రిస్టల్ కుక్కు(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)
జియో హాట్‌స్టార్
- జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ సినిమా)
- అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా)
- జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ)
అమెజాన్ ప్రైమ్
- నిశాంచి(హిందీ సినిమా)
- మాలిస్ సీజన్-1(హాలీవుడ్ వెబ్ సిరీస్)
ఆహా
- కె ర్యాంప్ (తెలుగు సినిమా) – నవంబరు 15
జీ5 ఓటీటీలో
- దశావతార్ (మరాఠీ సినిమా)
- ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ వెబ్ సిరీస్)
సన్ నెక్ట్స్ ఓటీటీలో
- మారుతం(తమిళ సినిమా)
- దండకారణ్యం(తమిళ సినిమా) ఆపిల్ టీవీ ప్లస్
- కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లిష్ సినిమా)
మనోరమ మ్యాక్స్
- కప్లింగ్ (మలయాళ సిరీస్)
సింప్లీ సౌత్
- పొయ్యమొళి (మలయాళ సినిమా) యోలో (తమిళ సినిమా)
Tamil film #Dude STREAMING NOW on #Netflix in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam Audio
Directed By – @Keerthiswaran_
Starring – @pradeeponelife | @_mamithabaiju | #NehaShetty | @realsarathkumar#PradeepRanganathan pic.twitter.com/Oa7VHNLWM9
— OTT Streaming Updates (@gillboy23) November 14, 2025
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








