AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ ఇంటర్నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా

ఈ ఏడాది విడుదలైన అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఇది కూడా ఒకటి. టీజర్ తోనే ఈ మూవీ సంచలనం రేకెత్తించింది. కొన్ని సన్నివేశాలు సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వ్యతిరేకత మొదలైంది. ఇప్పుడీ బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ ఇంటర్నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 04, 2025 | 8:47 PM

Share

ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. అప్పుడే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా మంగళవారం (నవంబర్ 04) అర్ధరాత్రి నుంచి ఒక కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది ఆషామాషీ సినిమా కాదు. ఈ ఏడాది అత్యంత వివాదాస్పదమైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. టీజర్ తోనే ఈ సినిమా ఎన్నో వివాదాలను మూటగట్టుకుంది. సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, యువతను పెడదోవ పట్టించేలా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టే థియేటర్లలో రిలీజ్ కు ఈ సినిమా చాలా అడ్డంకులు ఎదుర్కొంది. ముఖ్యంగా సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది. సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలకు కట్ చెప్పింది. ఆ తర్వాతే ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. కాగా ఈ తరం జనరేషన్ కు కనెక్ట్ అయ్యే ఈ సినిమాకు బిగ్ స్క్రీన్ పై మంచి ఆదరణే దక్కింది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోయినా యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రమ్య ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరుగుతుంది.

అదే సమయంలో చాలా మంది అమ్మాయిల్లాగే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటుంది రమ్య. అలా స్కూల్ లో ఒకరిని, కాలేజీలో ఉన్నప్పుడు మరొకరిని, ఉద్యోగం చేస్తూ ఇంకొకరిని లవ్ చేస్తుంది. అయితే వివిధ కారణాలతో వీళ్లందరితోనూ రమ్య విడిపోతుంది. దీంతో ఒకానొక సందర్భంలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్తుంది. మరి ఈ పరిస్థితి నుంచి రమ్య ఎలా బయటపడింది? ఆమెపై బ్యాడ్ గర్ల్ అని ఎందుకు ముద్ర పడింది అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ పేరు బ్యాడ్ గర్ల్. స్టార్ డైరెక్టర్లు ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మంచడం గమనార్హం. వర్ష భరత్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా, శరణ్య రవిచంద్రన్ మరో కీలక పాత్రలో మెరిసింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాడ్ గర్ల్ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.