పవన్ కల్యాణ్, ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథ.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్ .. ఏ సినిమానో తెలుసా?
పవన్ కల్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఈ టాప్ హీరోల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హీరోలకు కోట్లాది మంది అభిమానులున్నారు. వీరి సినిమాలకు జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్ల మోత మోగడం ఖాయం.

సినిమా కథలో ఎంపికల్లో ఒక్కో హీరోకు ఒక్కో క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ కథ తనకు సూటవుతుందా? అభిమానులకు నచ్చుతుందా? కామన్ ఆడియెయన్స్ ను ఎలా ఆకట్టుకోవాలి? అన్న అంశాలను ప్రధానంగా తీసుకుంటారు. అందుకే ఒక్కోసారి తమ దగ్గరకు మంచి సినిమా కథలు వచ్చినా వివిధ సమీకరణాల నేపథ్యంలో వాటిని చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఫలితంగా ఆ సినిమా కథలు వేరే హీరోల దగ్గరకు వెళుతంటాయి. అలా చేతులు మారిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ అవ్వచ్చు. మరికొన్ని బోల్తా పడవచ్చు. అలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వద్దన్న ఒక కథతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రామ్ చరణ్. ఆ సినిమా ఏదో తెలుసుకుందాం రండి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అలాగే అతను వదులుకున్న సినిమాల లిస్ట్ కూడా పెద్దదే. ఇడియట్, అతడు, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, పోకిరి, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి.. ఇలా పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా వివిధ కారణాలతో చాలా సినిమాలను వదులుకున్నాడు. ఒక్కడు, దిల్, స్టూడెంట్ నెంబర్ వన్, ఆర్య, బృందావనం, డాన్ శీను, ఊసరవెల్లి.. ఇలా ప్రభాస్ రిజెక్షన్ లిస్ట్ పెద్దదిగానే ఉంది. అయితే పవన్, ప్రభాస్ ఇద్దరూ రిజెక్ట్ చేసిన ఓ సినిమా కథతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ సినిమా మరేదో కాదు నాయక్.
రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన నాయక్ సినిమా కథ ముందుగా ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట. కానీ ప్రభాస్ అప్పటికే మిర్చి సినిమాతో బిజీగా ఉండటంతో వి.వి వినాయక్ రామ్ చరణ్‌ను కలిశాడట. దీంతో నాయక్ సినిమా పట్టాలెక్కిదంట. ఇక ప్రభాస్ కన్నా ముందే ఇదే కథను పవన్ కు కూడా వినిపించారట వినాయక్. అయితే ఆయన కూడా ఈ మూవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.
ఇటీవల జరిగిన అల్లు శిరీష్- నయనికల ఎంగేజ్మంట్ వేడుకలో రామ్ చరణ్
So happy for you, @AlluSirish Congratulations!
Wishing you and #Nayanika a lifetime of happiness, love and togetherness ❤️ pic.twitter.com/yLwwrqMfoO
— Ram Charan (@AlwaysRamCharan) November 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








