ఐబొమ్మ.. ఇక నై బొమ్మేనా? వెండితెర పాలిట మొండోడు.. అసలు ఎవడీడు?
పైరసీ అంటే.. ఎవడో ఏదో థియేటర్లో దూరి చాటుమాటుగా ఫోన్‌లో రికార్డ్ చేసి అప్‌లోడ్ చెయ్యడం... ఆ వెబ్‌సైట్‌ను మన బ్రౌజర్‌లో ఓపెన్ చేసి సినిమాను అప్పనంగా చూసుకోవడం.. ఇదే అనుకుంటాం. కానీ.. ఇది పైరసీ సబ్జెక్ట్‌లో టెన్ పర్సెంట్ మాత్రమే. మిగతా 90 శాతం పైరసీ గురించి తెలిస్తే ఇండస్ట్రీ మొత్తం షేకౌతుంది. దాని అంతు చూడ్డంలో ఓ ఒక్కో అడుకూ ముందుకేస్తున్నారు మన సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ మెయిన్ అడ్మినిస్ట్రేటర్‌ని అరెస్టు కావడం, ఆ దిశగా మరొక బిగ్‌బ్రేక్‌త్రూ. అసలు ఇదంతా ఓవర్‌నైట్‌లో జరిగింది కాదు. నాలుగు నెలల ఆపరేషన్‌కి క్లయిమాక్స్ లాంటిది.

సినిమా చూపిస్త మావా.. ఇదీ టైటిల్. కరేబియన్ దీవులు టు హైదరాబాద్ వయా ప్యారిస్.. ఖతర్నాక్ క్రైమ్ కహానీ. కథానాయకుడి పేరు ఇమ్మడి రవి. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మాట్లాడేది ఐబొమ్మ అనే మొండితెర గురించేనని. పైరసీ బిజినెస్‌తో కొన్నేళ్లుగా వందల కోట్లు వెనకేసుకున్న ఐబొమ్మ ఓనర్ ఇప్పుడు ఊచల్లెక్కబెట్టబోతున్నాడు. చాన్నాళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీ చెవిలో పడ్డ ఈ శుభవార్త పూర్వాపరాలేంటో డీటెయిల్డ్‌గా చూద్దాం.. హిట్.. ద థర్డ్ కేస్.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నానీ ప్రొడ్యూస్ చేసి, హీరోగా నటించి ఈ సినిమా.. రిలీజ్‌కి 18 గంటల ముందే, ఫుల్ HD క్వాలిటీతో క్రిస్టల్ క్లియర్ సౌండ్‌తో ఆన్‌లైన్‌లో వచ్చేసింది. ఇండస్ట్రీ మొత్తం షాక్. ఇటువంటిదే మరో షాకింగ్ ఏంటంటే.. మంచు విష్ణు కోట్లు కుమ్మరించి ఆరేడేళ్లు పడ్డ కష్టానికి ఫలితం కన్నప్ప మూవీ. ఈ సినిమా VFX విజువల్స్ ఉన్న హార్డ్‌డిస్కే గల్లంతైంది. ఎవరో ఎత్తుకెళ్లారు అని ఆయన కంప్లయింట్ ఇస్తే నవ్వి ఊరుకున్నారు. కానీ, ఇదంతా నవ్వి ఊరుకునే సమాచారం కాదు. ఎంత సీరియస్ మేటర్ అంటే ఏటా సినిమా ఇండస్ట్రీకి 22 వేల కోట్ల గండి కొట్టేంత సీరియస్. పైరసీ బారిన పడి, కంటెంట్‌ని కాపాడుకోలేక నానా యాతనా పడుతోంది సినిమా పరిశ్రమ. ఫిలిమ్ కంటెంట్ చోరీలో ఆరితేరినవాడు, పైరసీ డార్క్ ఎంపైర్‌కే చక్రవర్తి లాంటోడు, మొత్తం పింక్ ఇండస్ట్రీనే ఒక ఆట ఆడుకుంటున్న...
