AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : ఇది టైటిల్ రివీల్ మాత్రమే.. ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా.. మహేష్ బాబు..

మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రివీల్ చేశారు. అలాగే గ్లోబ్ ట్రోటర్ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అని అన్నారు.

Mahesh Babu : ఇది టైటిల్ రివీల్ మాత్రమే.. ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా.. మహేష్ బాబు..
Mahesh Babu Ssmb 29
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2025 | 9:51 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రివీల్ చేయగా.. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ మూవీ తొలి ఈవెంట్ లో టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. వారి సమక్షంలోనే సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ప్రకటించారు. 2027లో ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

అనంతరం ఈ వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ” కొంచెం కొత్తగా ఉంది.. కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవడం.. స్టేజీ మీదకు నడుచుకుంటూ వస్తా అంటే నో అన్నాడు.. అన్నింటికీ రాజమౌళి కుదరదు అంటున్నాడు.. ఇదంతా మీకోసమే.. నెక్ట్స్ చొక్కా లేకుండా రమ్మంటాడేమో..? అప్‌డేట్ అప్‌డేట్ అని అడిగారుగా.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.. అని అన్నారు.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

” నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు.. ఆయనెప్పుడూ ఒక పౌరాణిక సినిమా చేయమనేవారు.. ఆ మాట నేను వినలేదు.. ఈ రోజు నా మాటలు ఆయన వింటూ ఉంటారు.. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి.. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ ఇ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్.. నా దర్శకుడిని గర్వపడేలా చేస్తా.. వారణాసి రిలీజ్ అయినపుడు ఇండియా మొత్తం మమ్మల్ని చూసి గర్వపడుతుంది.. ఇది టైటిల్ రివీల్ మాత్రమే.. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అనేది మీకు చాలా చిన్నమాట” అని అన్నారు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు