ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు కేవలం 5 వేల రూపాయలతో ఇండియాకు వచ్చి తినడానికి కూడా ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు కేవలం 5 నిమిషాలు నటించి కోట్లు సంపాదిస్తుంది.
హీరోయిన్ కావాలని సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఊపేస్తుంది. ప్రస్తుతం హిందీలో అత్యధిక డిమాండ్ ఉన్న బ్యూటీ ఆమె.
ఆమె మరెవరో కాదండి. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. కెనడాకు చెందిన ఈ అమ్మడు కేవలం 5వేలతో ఇండియాకు వచ్చి అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడింది.
బాహుబలి సినిమాలో మనోహరి పాటకు ఆడిపాడింది. సినిమా ప్రపంచంలోకి రాకముందు నోరా ఫతేహి అనేక కష్టాలు పడింది. అలాగే ఎన్నో మోసాలు చూసింది.
ఇప్పుడు హిందీ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోస్ అందరి సరసన స్పెషల్ సాంగ్స్ చేసింది. 5 నిమిషాల కోసం 5 కోట్లు వసూలు చేస్తుంది.
ఫిబ్రవరి 6, 1992న కెనడాలోని మాంట్రియల్‌లో జన్మించింది. ఆమె తండ్రి భారతదేశానికి చెందినవాడు కావడంతో చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనుకుంది.
హిందీ చిత్రం 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్'తో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనూ పలు సాంగ్స్ చేసింది.
నోరా డ్యాన్స్ మూమెంట్స్ కు యూత్ ఫిదా అవుతుంటారు. ఇప్పటివరకు హీరోయిన్ గా కాకుండా.. అటు స్పెషల్ పాటలతోనే హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది.