AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29 Globetrotter Event: మహేష్ సెల్ ఫోన్ ఎలా వాడతాడో తెలుసా? ఆసక్తికర విషయం బయటపెట్టిన రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ యాక్షన్ అడ్వంచెరస్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం (నవంబర్ 15) హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది.

SSMB 29 Globetrotter Event: మహేష్ సెల్ ఫోన్ ఎలా వాడతాడో తెలుసా? ఆసక్తికర విషయం బయటపెట్టిన రాజమౌళి
SSMB 29 Globetrotter Event
Basha Shek
|

Updated on: Nov 15, 2025 | 9:54 PM

Share

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో హీరో మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించారు దర్శక ధీరుడు రాజమౌళి. అతనిని చూసి తాను కూడా అలా ఉండేందుకు ట్రై చేస్తాను’ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసినందుకు పోలీసులకు థ్యాంక్యూ. కేఎల్ నారాయణ గారూ నన్ను, మహేష్‌ను కలిపినందుకు థ్యాంక్యూ. నేను ప్రతీ సినిమా ముందు ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పాను. కొన్ని సినిమాలకు కుదురుతుంది. ఈ సినిమాకు మాటలు సరిపోవు. ఇలాంటి సినిమా కథను మాటల్లో చెప్పడం కుదరదు. కథ చెప్పకూడదు.. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయాలనే ఉద్దేశంతోనే వీడియో చేసాం. మార్చ్ నుంచి ప్లాన్ చేసాం. జూన్, జులై అలా అన్ని అయిపోయాయి. నవంబర్‌లో వస్తున్నాం. చిన్నపుడు నాకు కృష్ణ గారి గొప్పతనం తెలియదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమయ్యాక ఆయన గొప్పతనం అర్థమైంది. కొత్త టెక్నాలజీని పరిచయం చేయడానికి ఎన్నో దారులు వేయాలి. అలాంటిది కృష్ణ గారూ ఎన్నో పరిచయం చేసారు.. సినిమా స్కోప్ అల్లూరి, ఈస్ట్ మెన్ కలర్ ఈనాడు, ఫస్ట్ 70ఎంఎం సింహాసనం ఇంట్రడ్యూస్ చేసారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు ప్రీమియమ్ లార్జ్ స్కేల్ సినిమా ఫర్ ఐమాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఐమాక్స్‌లో ప్రొడ్యూస్ చేసి 1 ఇష్టూ 1.9 ఫార్మాట్‌లో షూట్ చేసాం. ఇది ఫుల్ స్క్రీన్ ఫార్మాట్.’

‘మహేష్ బాబు గురించి మాట్లాడాలి.. సినిమా గురించి, నటన గురించి కాదు.. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి.. అందరూ నేర్చుకోవాలనుకునే గుణం ఉంటుంది. మనందరికీ సెల్ ఫోన్ అడిక్షన్ ఉంటుంది.. ఆఫీస్‌కు వచ్చాడు, షూటింగ్‌కు వచ్చాడంటూ సెల్ ఫోన్ ముట్టుకోడు.. మళ్లీ వెళ్లేటప్పుడే ఫోన్ టచ్ చేస్తాడు. అందరం పాటించాలి.. నీలా ఉండటానికి ట్రై చేస్తాను’ అని మహేష్ పై ప్రశంసలు కురిపించాడు రాజమౌళి.

ఇవి కూడా చదవండి

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు