AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : బిగ్‏బాస్ ముద్దుబిడ్డకు షాక్.. ఓటింగ్‏లో దూసుకొచ్చిన ఆ కంటెస్టెంట్.. టైటి‏ల్‏కు ఎసరు పెట్టినట్టే..

‏‏బిగ్‏బాస్ రియాల్టీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఇక షో సాగుతున్న కొద్ది టైటిల్ రేసులో ఎవరు ఎలా ఛేంజ్ అయ్యారనేది కూడా గమనించలేం. ప్రతి రోజూ ఎపిసోడ్స్, ప్రవర్తన, ఆట తీరుతో కంటెస్టెంట్స్ ఓటింగ్స్ మారుతుంటాయి. తాజాగా బిగ్‏బాస్ ముద్దుబిడ్డకు షాక్ తగిలింది.

Bigg Boss 9 Telugu : బిగ్‏బాస్ ముద్దుబిడ్డకు షాక్.. ఓటింగ్‏లో దూసుకొచ్చిన ఆ కంటెస్టెంట్.. టైటి‏ల్‏కు ఎసరు పెట్టినట్టే..
Thanuja
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2025 | 1:21 PM

Share

‏ బిగ్‏బాస్ సీజన్ 9… ఇప్పుడు పదో వారం నడుస్తుంది. ట్రోఫీ కోసం కంటెస్టెంట్స్ అందరూ గట్టిగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం బీబీ రాజ్యం పేరుతో హౌస్ లో టాస్కులు జరుగుతుండగా.. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. అలాగే వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే.. మొదటి నుంచి టైటిల్ రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తనూజ. టాస్కులలో అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా.. ఎక్కువగా ఫుటేజ్ ఇస్తూ బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. తనూజ నామినేషన్లలో ఉన్నప్పటికీ సేఫ్ గానే ఉంటుంది. అత్యధిక ఓటింగ్ తో టాప్ లో దూసుకుపోతుంది. కానీ ఇఫ్పుడు ఈ అమ్మడుకు షాక్ తగిలింది. అనుహ్యంగా ఓ కంటెస్టెంట్ టాప్ లోకి దూసుకోచ్చారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

ప్రస్తుతం పదవ వారం నామినేషన్లలో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ నామినేట్ అయ్యారు. అయితే మొదటి నుంచి టాప్ లో తనూజ దూసుకుపోతుండగా.. ఆ తర్వాత సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతూ, భరణి , డీమాన్ పవన్ ఉన్నారు. తక్కువ ఓటింగ్ తో దివ్య, నిఖిల్, గౌరవ్ డేంజర్ జోన్ లో ఉండగా.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ తో ఓటింగ్ మలుపు తిరిగింది. దీంతో టాప్ లో తనూజ ప్లేస్ లోకి వచ్చేశాడు కళ్యాణ్ పడాల. నిజానికి మొదట్లో కళ్యాణ్ కు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. కానీ ఏ రోజైతే శ్రీజ రీఎంట్రీగా వచ్చి కళ్యాణ్ తప్పొప్పులు చెప్పిందో.. అప్పటి నుంచి కాస్త ఆట మార్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి
Thanuja, Kalyan Padala

Thanuja, Kalyan Padala

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

ఇప్పుడిప్పుడే హౌస్ లో జన్యూన్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. ఇక ఈ వారం నామినేషన్ ఓటింగ్ లో అత్యధిక ఓటింగ్ తో టాప్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో కళ్యాణ్ ఉండగా.. అతడి తర్వాత తనూజ సెకండ్ ప్లేస్ లో ఉంది. తర్వాత రీతూ చౌదరి, డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన ఉండగా.. చివరగా గౌరవ్, నిఖిల్, దివ్య ఉన్నారు. అయితే ఈ వారం దివ్య, నిఖిల్ ఇద్దరూ ఎలిమినేషన్ కు దగ్గరగా ఉన్నారు. గతవారం భరణి కోసం తనూజను పర్సనల్ అటాక్ చేసింది దివ్య. కావాలని తనూజను టాస్కు నుంచి తీసేయడం.. అనవసరంగా వాదించడంతో ఆమెను ఈసారి ఎలాగైనా బయటకు పంపించేయాలని గౌరవ్, నిఖిల్ కు ఓట్లు గుద్దిపడేస్తున్నారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. దివ్య, నిఖిల్ ఇద్దరూ ఎలిమినేట్ ఛాన్స్ ఉంది.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..