Bigg Boss Telugu 9: కల్యాణ్‌కు బిగ్ షాక్.. బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా? ఇక ఆపడం కష్టమే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కల్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్సీ టాస్కులో అతనికి చుక్కుదురైంది. దీంతో ఈ వారం ఎవరూ ఊహించని కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా ఎంపికైంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ రియాలిటీ షో తొమ్మిదవ వారంలోకి వచ్చేసింది. దీంతో ఇప్పటి నుంచి కంటెస్టెంట్ల గేమ్ కీలకంగా మారనుంది. వారి ఆట, మాట తీరే వారిని హౌస్ లో ఉంచాలా? వద్దా? అని నిర్ణయిస్తోంది. కాగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రస్తుతం హౌస్ లో హోరా హోరీ పోరు జరుగుతోంది. గత రెండు రోజులకు కెప్టెన్సీ కోసం జరుగుతున్న పోటీకి ఎట్టకేలకు ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ తనూజ ఇప్పటివరకు ఒక్కసారి కూడా హౌస్ కెప్టెన్ కాలేదు. అయితే ఈ వీక్ మాత్రం కెప్టెన్సీ టాస్కులో ఆమె శివంగిలా రెచ్చిపోయింది. కెప్టెన్సీ పోరు కోసం బిగ్ బాస్ బీబీ రాజ్యం పేరుతో టాస్క్ ఇచ్చాడు. కళ్యాణ్.. క్వీన్ రీతూ, దివ్యలను కంటెండర్స్ గా ప్రకటించాడు బిగ్ బాస్. అయితే వారికి కమాండర్స్ గా తనూజ, నిఖిల్, డిమోన్ పవన్, సంజనలను నియమించాడు. అయితే వీరిలో తనూజ. నిన్న జరిగిన టాస్కులో క్వీన్ దివ్యని ఓడించి నిఖిల్ కింగ్ అయ్యాడు.
ఇక ఈ రోజు జరిగిన టాస్క్ ల్లో తనూజ, సంజనలు ఆడారు. ఇందులో తనూజ బాగా ఆడి కెప్టెన్సీ కంటెండర్ వరకు చేరుకుంది. ఫైనల్ కింగ్ నిఖిల్, క్వీన్ రీతూ, కమాండర్ నుంచి తనూజ.. ఇక ప్రజల నుంచి సుమన్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లు నిలిచారు. వీరిలో నలుగురు పోటీ పడగా చివరకు తనూజ కెప్టెన్సీని సొంతం చేసుకుంది. ఫైనల్ గా తొమ్మిదో వారం కెప్టెన్ గా తనూజ నిలిచిందని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఇవాళ్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
ఇక తనూజను ఆపడం కష్టమే..
కాగా ప్రస్తుతం బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ లో తనూజ. దాదాపు ప్రతి వారం నామినేషన్స్ లో నిలుస్తోన్న ఆమెకు బయటి నుంచి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈ వారం ఓటింగ్ లోనూ ఆమె టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఒకవేళ తనూజ కెప్టెన్ అయితే మాత్రం టైటిల్ రేసులో ఆమె మరో మెట్టు పైకెక్కినట్టే.
బిగ్ బాస్ తెలుగు 9 లేటెస్ట్ ప్రోమో..
It’s battle time in the house! Get ready for the ultimate clash episode! 🔥⚔️
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/2i6hlcFs2c
— Starmaa (@StarMaa) November 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








