Bigg Boss 9 Telugu: వార్నీ.. ఏందక్క నీ ప్లాన్.. అలా టచ్ చేశావంటూ డీమాన్ పై రెచ్చిపోయిన తనూజ..
తనూజ.. ఇప్పుడు టైటిల్ ముందున్న కంటెస్టెంట్. ముందు నుంచి తన ఆటిట్యూడ్, ప్రవర్తనతో పాజిటివిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు.. చేతులారా నెగిటివిటీని మూటగట్టుకుంటుంది. ఎపిసోడ్ లో దాదాపు సగానికిపైగా తనూజ ఫుటేజ్ చూపిస్తూ కావాల్సినంత ఫాలోయింగ్ పెంచేస్తున్నాడు బిగ్ బాస్. మరోవైపు తనూజ కావాలని ఫుటేజ్ కోసం అనవసర గొడవలు క్రియేట్ చేస్తుంది.

తనూజ.. ఇప్పుడు టైటిల్ ముందున్న కంటెస్టెంట్. ముందు నుంచి తన ఆటిట్యూడ్, ప్రవర్తనతో పాజిటివిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు.. చేతులారా నెగిటివిటీని మూటగట్టుకుంటుంది. ఎపిసోడ్ లో దాదాపు సగానికిపైగా తనూజ ఫుటేజ్ చూపిస్తూ కావాల్సినంత ఫాలోయింగ్ పెంచేస్తున్నాడు బిగ్ బాస్. మరోవైపు తనూజ కావాలని ఫుటేజ్ కోసం అనవసర గొడవలు క్రియేట్ చేస్తుంది.బిగ్‌బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు డీమాన్ పవన్, భరణి, ఇమ్మాన్యుయేల్, దివ్య, రీతూ. కానీ టైటిల్ రేసులో దూసుకుపోతుంది మాత్రం తనూజ, ఇమ్మా్న్యుయేల్, కళ్యాణ్, సుమన్ శెట్టి. అయితే ఈసారి సీజన్ 9లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే తనూజ.. అనవసరమైన గొడవ స్టార్ట్ చేయాలంటే ముందుండేది తనూజ. అక్కర్లేని గొడవలు చేస్తూ.. హౌస్మేట్స్ సైతం షాకయ్యేలా అనవసర వాదన చేస్తూ అటు జనాలకు సైతం విసుగు తెప్పిస్తుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తన ప్రవర్తనతో జనాలకు మరింత చిరాకు తెప్పించింది. ఉమెన్ కార్డ్, సింపతి గేమ్ ప్లే చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో కిచెన్ బల్ల మీద ఎక్కి కూర్చొని పెద్ద గోల చేసింది తనూజ. తర్వాత రాజ్యంలోని మహారాణులు రీతూ, దివ్య ఇద్దరూ ఇమ్మాన్యుయేల్ ను ఓ ఆటాడుకున్నారు.
ఇక తనూజకు రివేంజ్ ప్లాన్ చేసిన కళ్యాణ్, రీతూ, దివ్య ముగ్గురు తనూజను తీసుకువచ్చి టేబుల్ పై కూర్చొబెట్టండి అని డీమాన్, నిఖిల్ ఇద్దరికి చెప్పారు. దీంతో తనూజను నడు అన్నట్లు డీమాన్ భుజం పై టచ్ చేశాడు. దీనికి చేయి వేస్తున్నావేంట్రా.. నో ఉమెన్ హ్యాండ్ లింగ్, ఏయ్ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటీ అంటూ గొడవ స్టార్ట్ చేసింది. రాణి ఆర్డర్ అంటూ నిఖిల్ చెప్తుంటే.. అయితే ఏంటీ.. అబ్బాయిల్లా హ్యాండిల్ చేస్తారేంటీ అనడంతో.. మ్యాన్ హ్యాండిల్ కాదు.. కమాండర్స్ లా చేస్తున్నారని దివ్య చెప్పింది. దీంతో మరింత ఓవర్ గా రియాక్ట్ అయ్యింది తనూజ.

Bigg Bss
డీమాన్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసినప్పటికీ మ్యాన్ హ్యాండ్లింగ్, వెనకాల నుంచి చేతితో నెట్టిన ఫోర్స్ నాకు నచ్చలేదు..నేను హర్ట్ అయ్యాను అంటూ డీమాన్ పై సీరియస్ అయ్యింది. నాకు ఫ్రెండ్ గా చెప్పు.. కానీ తోయడం నచ్చలేదు అంటూ ఫైర్ అయ్యింది. నువ్వు అన్న తర్వాత నేను ఏమన్నా చేశానా.. చేయలేదు కదా అని డీమాన్ చెప్పినా తనూజ వినకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ పదే పదే సీరియస్ అయ్యింది. దీంతో దివ్య మాట్లాడుతూ.. మ్యాన్ హ్యాండ్లింగ్ అని పదే పదే అనకు.. బయటకు వేరేలా వెళ్తుంది అంటూ హెచ్చరించింది. అయితే ఈ విషయంలో మాత్రం డీమాన్ పై ఊరికే కామెంట్స్ చేస్తూ అతడిని మరింత నెగిటివ్ చేసేందుకు ట్రై చేసింది తనూజ. డీమాన్ చెప్తున్నప్పటికీ వినిపించుకోకుండా అతడిపై అరుస్తూ గొడవను మరింత సాగదీసింది.

Bigg Boss 9 Telugu
నిన్ను పడేశాను.. కదా.. లేపేశాను కదా అని డీమాన్ సీరియస్ కావడంతో.. ఏమో ఊరికే ఉండుంటే చేసేవాడివేమో అంటూ అర్థం లేకుండా మాట్లాడింది. దీంతో చేస్తే అను.. చేసేవాడివేమో అని ఊహించుకోకు అంటూ కౌంటరిచ్చాడు డీమాన్. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో కావాలని గొడవను సాగదీస్తూ డీమాన్ ను మరింత నెగిటివ్ చేసేందుకు తనూజ ట్రై చేసిందని అంటున్నారు అడియన్స్. మరీ తనూజ అతి చేష్టలపై వీకెండ్ లో నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అప్పుడు ప్రియురాలిగా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్.. చిరుతో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..




