Bigg Boss 9 Telugu: నన్ను తొక్కి నువ్వు లేవాలనుకోకు.. దివ్య పై రెచ్చిపోయిన రీతూ చౌదరి..
బిగ్‌బాస్ సీజన్ 9లో ప్రస్తుతం బీబీ రాజ్యం నడుస్తోంది. కళ్యాణ్ కింగ్, దివ్య, రీతూ ఇద్దరు మహారాణులుగా టాస్కులు నడుస్తున్నాయి. మరోవైపు ప్రజలు, కమాండర్స్ మధ్య టాస్కులు జరుగుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రీతూ, దివ్య మధ్య గట్టిగానే ఫైట్ జరిగింది. అయితే ఈసారి మహారాణుల మధ్య చిచ్చుపెట్టాడు బిగ్ బాస్. దీంతో దివ్యపై రెచ్చిపోయింది రీతూ.

బిగ్‌బాస్ సీజన్ 9లో బీబీ రాజ్యం పేరుతో టాస్కులు నడుస్తున్నాయి. ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి, గౌరవ్ ప్రజలు కాగా.. డీమాన్ పవన్, సంజన, తనూజ, నిఖిల్ కమాండర్స్ గా ఉన్నారు. అయితే మొన్నటి వరకు ప్రజలు, కమాండర్స్ మధ్య టాస్కులు పెట్టిన బిగ్‌బాస్ .. ఇప్పుడు మహారాణుల మధ్య చిచ్చు పెట్టారు. నిన్నటి ఎపిసోడ్ లో రాజు, రాణులు వారి స్థానం పదిలం కాదని నేను ముందే చెప్పాను.. ఇప్పుడు మిమ్మల్ని ఓడించి మీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కమాండర్స్ సిద్ధంగా ఉన్నారు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ముందుగా ఏ ఒక్కరు తమ స్థానాన్ని రిస్కులో పెట్టి కమాండర్ తో పోటీ పడాలి అని చెప్పాడు. దీంతో రీతూ, కళ్యాణ్, దివ్య ముగ్గురూ ఎవరు టాస్కు ఆడాలి అని డిస్కస్ చేసుకున్నారు. ఇక కళ్యాణ్, రీతూ ఇద్దరూ కలిసి దివ్యను కార్నర్ చేశారు. బెటర్ ఛాన్సె్స్ నీకు ఎక్కువగా వస్తున్నాయి నువ్వే వెళ్లు అంటూ కళ్యాణ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అప్పుడు ప్రియురాలిగా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్.. చిరుతో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నాకు ఎవరూ ఛాన్స్ ఇవ్వట్లేదు.. నాకు నేను కల్పించుకుంటున్నాను.. తనకు అంత ఛాన్స్ ఇచ్చిన గెలవలేకపోయింది అంటూ రీతూను మధ్యలోకకి లాగింది. దీంతో రీతూ రెచ్చిపోయింది. నువ్వు నీ గురించి ఫైట్ చేసుకో.. పక్కనోళ్లని తక్కువ చేసి ఫైట్ చేయకూడదు.. నన్ను తొక్కి నువ్వు లేవకు.. అంటూ సీరియస్ అయ్యింది. ఇక చివరిగా నిన్ను పంపించడమే కరెక్ట్ అని అనిపిస్తుంది అంటూ కళ్యాణ్ చెప్పడంతో.. సరే వదిలేయ్ అంటూ దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది..
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
మరోవైపు కమాండర్స్ కు ఏ స్థానాన్ని మెరుగుపరుచుకుని రాజు, రాణి అవ్వాలన్నది మీలో మీరు చర్చించుకోండి అని చెప్పండంతో.. సంజన, తనూజ, గౌరవ్, నిఖఇల్ నేడు ఆడతా అంటే నేను ఆడతా అని వాదించుకున్నారు. తీరా చిట్టిలు వేసాకా.. డీమాన్, నిఖిల్ పేర్లు వచ్చాయి. కొత్త రాజు కోసం ఎిమ్ ఫర్ క్రౌన్ అనే టాస్కు పెట్టారు. అందులో దివ్య, నిఖిల్ పోటీ పడ్డారు..
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‌బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..








