Actress : ఆరుగురు బిడ్డల తండ్రితో ప్రేమ.. పెళ్లి కాకుండానే తల్లైన హీరోయిన్.. చివరకు..
సినీ పరిశ్రమలో చాలా మంది నటీమణులు తమ కెరీర్‌లో అనేక హిట్ చిత్రాలను అందించారు. తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నిజ జీవితంలో చేసిన పొరపాట్లతో కెరీర్ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యింది.

సాధారణంగా సినీరంగంలో చాలా మంది నటీమణులు తమ కెరీర్‌లో అనేక హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, వారు పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడటంతో వారి కెరీర్లు దిగజారిపోయాయి. అలాంటి నటి ఒకరు, ఆరుగురు పిల్లల తండ్రి అయిన నటుడిని ప్రేమించారు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. అయితే ఆమె ఎప్పుడూ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోయింది. ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి పుష్పవల్లి. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ తల్లి. ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ పుష్పవల్లి. ‘రామాయణం’లో సీత పాత్రను పోషించడం ద్వారా ఆమె పాపులర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
పుష్పవల్లి మొదటి వివాహం 1940 లో జరిగింది, కానీ అది కేవలం ఆరు సంవత్సరాలకే ముగిసింది. ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేషన్ ఆమె జీవితంలోకి వచ్చారు. కొన్నాళ్లపాటు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. కానీ అప్పటికే జెమినీ గణేషన్ కు వివాహం జరిగింది. గణేశన్ పుష్పవల్లిని తన భార్యగా ఎప్పుడూ అంగీకరించలేదు. రేఖ, రాధ అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. తల్లి పుష్పవల్లి ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. రేఖ తరువాత బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యారు. రాధ సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో స్థిరపడ్డారు. సినిమాల్లో ఎక్కువగా సహయ పాత్రలతో మెప్పించింది పుష్పవల్లి.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
కానీ ఆమె ఎక్కువగా నటి రేఖ తల్లిగానే పాపులర్ అయ్యింది. ఎప్పుడూ కూతురు రేఖకు తోడుగా ఉన్న పుష్పవల్లి 1991లో మరణించారు. ప్రేమ కోసం జీవించిన మహిళ, కానీ చివరి వరకు తన కూతుళ్ల కోసం పోరాడింది.

Pushpavalli Movie
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..




