Kalki 2898 AD: కల్కి 2కి హీరోయిన్ ఫిక్సయినట్టేనా
లోకా ఛాప్టర్ వన్ చంద్ర సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న కల్యాణీ ప్రియదర్శన్... ఓ పాన్ ఇండియా సీక్వెల్‌లో నటించబోతున్నారన్న న్యూస్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై కల్యాణీ కూడా స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర.
సూపర్ హీరో సిరీస్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటమే కాదు, 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కల్యాణీ అప్ కమింగ్ మూవీస్‌కు సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా సీక్వెల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తొలి భాగంలో హీరోయిన్‌గా నటించిన దీపిక పదుకోన్ సీక్వెల్ నటించటం లేదు. ఇప్పుడు ఆమె స్థానంలో మరో బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శన్ నటించబోతున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. లోకా సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిన కల్యాణీ, సుమతి పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇదే ప్రశ్న కల్యాణీకి కూడా ఎదురైంది. కల్కిలో నటించటంపై స్పందించిన కల్యాణీ, నిజంగా ఆ ఆఫర్ నాకు వస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది అన్నారు. కానీ చిత్రయూనిట్ నుంచి ఇప్పటివరకు తనను ఎవరూ సంప్రదించలేదని, కానీ ఆడియన్స్ నన్ను ఆ పాత్రలో చూడాలనుకుంటున్నారు అంటేనే ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ
Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..
ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

