AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై ప్లేయింగ్ 11 నుంచి నలుగురు డేంజరస్ ప్లేయర్స్ ఔట్.. అయినా, ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారుగా..?

Players Miss MI Playing XI: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టు బలమైన స్క్వాడ్‌తో చర్చనీయాంశమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక పెద్ద సవాలుగా మారింది. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో కొంతమంది ప్రముఖ క్రికెటర్లు ఈ సీజన్‌లో ఎక్కువగా బెంచ్‌పైనే కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముంబై ప్లేయింగ్ 11 నుంచి నలుగురు డేంజరస్ ప్లేయర్స్ ఔట్.. అయినా, ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారుగా..?
Mumbai Indians
Venkata Chari
|

Updated on: Mar 14, 2026 | 8:48 AM

Share

MI predicted playing 11 IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ముంబై ఇండియన్స్ అత్యంత సమతుల్యమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో స్టార్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పెద్ద ఆటగాళ్లు కూడా జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా మారే అవకాశం ఉంది.

డీకాక్‌కు అవకాశాలు తగ్గినట్లే..?

ముంబై ఇండియన్స్ వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్ను తిరిగి జట్టులోకి తీసుకుంది. అయితే ప్రస్తుతం అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఓపెనింగ్‌లో రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు రియాన్ రికెల్టన్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో రికెల్టన్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది. అదనంగా విదేశీ ఆటగాళ్ల పరిమితి కారణంగా డీకాక్ బెంచ్‌పైనే ఉండే అవకాశం ఉంది.

విల్ జాక్స్‌కు కూడా పోటీ..

ముంబై ఇండియన్స్ జట్టులో విల్ జాక్స్ కూడా మ్యాచ్‌ను ఒంటరిగా మార్చగలిగే ఆల్‌రౌండర్. కానీ మిడిల్ ఆర్డర్ ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మా, హార్దిక్ పాండ్యాతో బలంగా ఉంది. ఇక విదేశీ ఆటగాళ్ల కోటాలో మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బోల్ట్ స్థానం దాదాపు ఖాయం. ఫినిషర్‌గా షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్ కు అవకాశం ఇస్తే విల్ జాక్స్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కడం కష్టమే.

బౌలింగ్ విభాగంలో కూడా పోటీ..

బౌలింగ్ విభాగంలో ముంబై ఇండియన్స్ వద్ద బలమైన ఎంపికలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ప్రధాన ఫాస్ట్ బౌలర్లుగా ఉంటారు. మూడో పేసర్ స్థానానికి దీపక్ చాహర్ మరియు శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ ఉంది. చాహర్ ఫిట్‌గా ఉంటే స్వింగ్ బౌలింగ్ కారణంగా అతనికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు.

స్పిన్ విభాగంలో మిచెల్ సాంట్నర్ ప్రధాన ఎంపిక కాగా, మయాంక్ మార్కండే, అల్లా గజన్ఫర్ వంటి బౌలర్లు ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించబడే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ సంభావ్య ప్లేయింగ్ XI..

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్. ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్ ఠాకూర్ లేదా మయాంక్ మార్కండేను ఉపయోగించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us