PEDDI KI AAWAZ :భోపాల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది కా ఆవాజ్’ గ్రాండ్ ఈవెంట్.. లైవ్ వీడియో మీకోసం
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో పెద్ది కా ఆవాజ్ పేరుతో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం లైవ్ వీడియో మీకోసం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మే 18న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా పెద్ది కా ఆవాజ్ పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంలో పెద్ది సినిమాకు సంగీతం అందిస్తోన్న ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్పెషల్ షో ఉండనుంది. అలాగే పలువురు సినీ ప్రముఖలు కూడా ఈ గ్రాండ్ ఈవెంట్ లో సందడి చేయనున్నారు. ఇదే సందర్భంగా పెద్ది స్పెషల్ సాంగ్ ను కూడా లాంఛ్ చేయనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లైవ్ వీడియో మీకోసం..
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

