ఉదయం గ్లో.. సాయంత్రానికి డల్ ఫేస్? మహిళల ముఖ కాంతిని లాగేస్తున్న ఆఫీస్ లైఫ్!
చాలా మంది ఉదయం ఆఫీసుకు వెళ్ళేటప్పుడు చాలా చక్కగా రెడీ అవుతారు. ఆ సమయంలో వారి చర్మం కూడా తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ, రోజు గడిచేకొద్దీ ముఖం కళావిహీనంగా కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల ముఖాలు అలసిపోయినట్లు కనిపిస్తాయి. ఏసీలో కూర్చున్నా కూడా ముఖంలోని కాంతి మాయమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో సాయంత్రానికల్లా ముఖం ఎందుకంత అలసిపోయి, కళావిహీనంగా కనిపిస్తుందని చాలా మంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. దీనికి కారణం ఏంటి..? డెర్మటాలిజిస్ట్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

ఉదయం ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఎంతో ఫ్రెష్‌గా, అందంగా ఉండే ముఖం.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి పూర్తిగా అలసిపోయి, కాంతివిహీనంగా మారిపోవడాన్ని చాలా మంది గమనించే ఉంటారు. దీనిని నిపుణులు టెక్ ఫేస్ (Tech Face) లేదా ఆఫీస్ ఎయిర్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. దీనికి గల ముఖ్యమైన కారణాలు, ఎలా నివారించాలో తప్పక తెలుసుకోవాలి.
బ్లూ లైట్ ప్రభావం (Blue Light & Digital Ageing):
లాప్‌టాప్‌లు, మొబైల్స్, ఆఫీస్ లోని కృత్రిమ ఎల్‌ఈడీ లైట్ల నుండి వెలువడే బ్లూ లైట్ (High Energy Visible – HEV Light) సూర్యరశ్మి కంటే లోతుగా చర్మంలోకి చొచ్చుకుపోతుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్ (Collagen) ను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మంపై ముడతలు రావడం, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు (Dark Circles) ఏర్పడటం, ముఖం నిస్తేజంగా మారడం జరుగుతుంది.
ఏసీ వాతావరణం వల్ల డీహైడ్రేషన్ (AC & Dehydration):
ఆఫీసుల్లో 8 నుండి 9 గంటల పాటు నిరంతరం నడిచే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ (AC) గాలిలోని తేమను పూర్తిగా పిండేస్తుంది. దీనివల్ల చర్మం లోపలి పొరల్లోని తేమను కోల్పోయి (Transepidermal Water Loss), పొడిబారిపోయి, పొట్టులా రాలడం లేదా జిడ్డుగా మారడం జరుగుతుంది.
వర్క్ స్ట్రెస్, హార్మోన్లు (Work Stress):
ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌ల వల్ల పెరిగే ఒత్తిడి శరీరంలో కార్టిసోల్ (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చర్మానికి జరిగే రక్తప్రసరణను తగ్గించి, ముఖాన్ని అలసిపోయినట్లుగా, పాలిపోయినట్లుగా చూపిస్తుంది.
తక్కువగా నీరు తాగడం:
పనిలో పడి చాలా మంది గంటల తరబడి నీళ్లు తాగడం మర్చిపో తుంటారు. శరీరానికి తగినంత నీరు అందకపోవడం నేరుగా ముఖంపై కనిపిస్తుంది.
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు (Tips to Protect Skin):
ఇండోర్ సన్‌స్క్రీన్ (Indoor Sunscreen): మీరు ఆఫీస్ లోపల, స్క్రీన్ల ముందే కూర్చున్నప్పటికీ.. బ్లూ లైట్ నుండి రక్షణ పొందడానికి ఉదయాన్నే లాప్‌టాప్ ఆన్ చేయడానికి ముందే ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ (Zinc Oxide లేదా Titanium Dioxide ఉన్నవి) రాసుకోవడం తప్పనిసరి.
బ్లూ లైట్ ప్రొటెక్షన్ గ్లాసెస్:
కళ్లు, కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మాన్ని కాపాడుకోవడానికి యాంటీ-బ్లూ లైట్ చైనీస్ లేదా గ్లాసెస్ ధరించడం మంచిది.
చిన్న బ్రేకులు తీసుకోండి:
ప్రతి గంటకు ఒకసారి సీటు నుండి లేచి కాసేపు కళ్లకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ముఖంపై చల్లటి నీటిని చల్లుకోవడం వల్ల చర్మం రీఫ్రెష్ అవుతుంది.
హైడ్రేషన్:
మీ డెస్క్ పై ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. పని మధ్యలో నీళ్లు తాగుతూ ఉండండి.




