AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Arvind: అధ్యక్ష పదవి అడిగా.. దానికి బండి సంజయ్ పేరు చెప్పిన.. TV9 క్రాస్‌ఫైర్‌లో అరవింద్ సంచలన కామెంట్స్..

MP Arvind: అధ్యక్ష పదవి అడిగా.. దానికి బండి సంజయ్ పేరు చెప్పిన.. TV9 క్రాస్‌ఫైర్‌లో అరవింద్ సంచలన కామెంట్స్..

Krishna S
|

Updated on: May 23, 2026 | 9:41 PM

Share

తెలంగాణ బీజేపీకి సీఎం క్యాండిడేట్ అవసరం లేదా? స్టేట్ ప్రెసిడెంట్ పదవి ఎంపికలో ఏం జరిగింది? అనే విషయాలపై టీవీ9 తెలుగు క్రాస్ ఫైర్ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అధ్యక్ష పదవి దక్కకపోవడం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని చెబుతూనే.. బీసీ సీఎం నినాదంపై కీలక కామెంట్స్ చేశారు.

తెలంగాణ బీజేపీలో లీడర్‌షిప్ మార్పులు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ TV9 క్రాస్ ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానికంగా ఎలాంటి సీఎం ముఖం అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీయే తమ పార్టీకి అసలైన ముఖమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్న విషయాన్ని అరవింద్ ఓపెన్‌గా ఒప్పుకున్నారు. “రాష్ట్ర అధ్యక్ష పదవిని నేను అడిగిన మాట వాస్తవమే, కానీ అది నాకు దక్కలేదు. అధిష్ఠానం నన్ను రెండో పేరు చెప్పమంటే.. నేను బండి సంజయ్ పేరు సూచించాను” అని అరవింద్ వెల్లడించారు. ఒకవేళ తనను అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి మరింత ప్లస్ అయ్యేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. పదవుల కోసం తనకు ఎలాంటి ఆరాటం లేదన్నారు. “ఏమి ఇస్తారో, ఏమి ఇయ్యరో నా చేతిలో లేదు. నా తండ్రికి కూడా సీఎం కావాలనే కోరిక ఎప్పుడూ లేదు, ఆయనకు పార్టీ ప్రెసిడెంట్ పదవి పైనే ఆసక్తి ఉండేది. 49 ఏళ్ల వయసులో నాకు ఎలాంటి వ్యక్తిగత కోరికలు లేవు, ఏ బాధ్యత ఇచ్చినా ప్యాషన్‌తో చేస్తా” అని అర్వింద్ చెప్పుకొచ్చారు.

2023 ఎన్నికల్లో బీజేపీ బలంగా వినిపించిన బీసీ ముఖ్యమంత్రి నినాదంపై అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీసీ నినాదం ప్రజల్లోకి బాగానే వెళ్లినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సరైన, బలమైన అభ్యర్థులు లేకపోవడం వల్లే ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన విశ్లేషించారు. తాను వ్యక్తిగతంగా కుల ఆధారిత ముఖ్యమంత్రుల పద్ధతిని పూర్తిగా వ్యతిరేకిస్తానని అరవింద్ స్పష్టం చేశారు. “బాగా పరిపాలన చేయగల సత్తా ఉన్నవారే ముఖ్యమంత్రి కావాలి, కులం అనేది ఎప్పుడైనా రెండో స్థానంలోనే ఉంటుంది” అని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో బీజేపీకి రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించడం చాలా సులభమని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, ఒరిస్సా వంటి అసలు బీజేపీకి ఛాన్సే లేదనుకున్న రాష్ట్రాల్లోనే జెండా పాతామని.. అలాంటిది తెలంగాణను కైవసం చేసుకోవడం తమకు పెద్ద కష్టం కాదన్నారు.

Published on: May 23, 2026 09:40 PM
Follow Us