కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండు సంవత్సరాలుగా వెండికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, యూఏఈతో ఒప్పందంలోని లోపాలను అరికట్టడానికి వెండిని ఫ్రీ ట్రేడ్ నుంచి పరిమిత ట్రేడ్లోకి మార్చింది. దీనివల్ల దేశంలో వెండి సరఫరా తగ్గి, ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.