AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..

భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..

Phani CH
|

Updated on: May 23, 2026 | 12:09 PM

Share

సిరిసిల్లలో ఓ భవనం పైభాగంలో చిక్కుకున్న శునకాన్ని అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. కిందికి దిగే మార్గం లేక భయంతో అరుస్తున్న కుక్కను తాళ్ల సహాయంతో గంటపాటు శ్రమించి సురక్షితంగా కిందికి దించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను స్థానికులు ఆసక్తిగా వీక్షించగా, మూగజీవాన్ని కాపాడిన ఫైర్ సిబ్బందిని ప్రశంసించారు.

ఎత్తయిన భవనంపైకి వెళ్ళిన ఓ శునకం ఊహించని విధంగా అక్కడ చిక్కుకుపోయింది. ఎటు వెళ్లాలో తెలియక.. ఎటూ దిగే దారిలేక నిస్సహాయంగా చూస్తూ.. తనను ఎవరైనా కిందకు దించి రక్షించకపోతారా అన్నట్టుగా సహాయం కోసం అరుస్తూ ఉండిపోయింది. అది చూసిన స్థానికులు చలించిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గల కుబేర క్లాత్ షోరూం భవనం పైభాగంలో ఓ కుక్క ప్రమాదకర స్థితిలో చిక్కుకుపోయింది. కిందికి దిగే మార్గం లేక, ఎటు కదలలేని పరిస్థితిలో భయంతో అది గట్టిగా అరుస్తూ ప్రాణాల కోసం విలవిలలాడింది. శునకం అరుపులు విన్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. భవనంపై ఉన్న శునకాన్ని చూసిన ఫైర్‌ సిబ్బందికి ఆ శునకం పరిస్థితి అర్ధమైంది. వెంటనే పైకి వెళ్లిన సిబ్బంది తాళ్ల సహాయంతో ఎంతో చాకచక్యంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ వచ్చినవారు తనను చంపడానికి వచ్చారు.. రక్షించడానికి వచ్చారో తెలియక ఆ శునకం భయంతో చూస్తూ ఉండిపోయింది. ఈ క్రమంలో సహాయ సిబ్బంది.. శునకాన్ని ఎంతో జాగ్రత్తగా ,తాళ్ల సాయంతో సురక్షితంగా కిందికి దించారు. సుమారు గంటపాటు సాగిన ఈ ఆపరేషన్‌ను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చివరకు కుక్కను ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి స్పందించి, మూగజీవం ప్రాణాలను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది మానవత్వాన్ని, వారి సేవలను స్థానికులు, జంతు ప్రేమికులు కొనియాడారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్‌ రిపోర్ట్‌ చూసి డాక్టర్స్‌ షాక్‌!

మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత వీర బాదుడే!

అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!

పూట గడవడానికి అప్పులు! అమెరికన్ల కష్టాలపై సర్వే!

ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు.. కొత్త రూల్ చూశారా?

Follow Us