పూట గడవడానికి అప్పులు! అమెరికన్ల కష్టాలపై సర్వే!
అమెరికాలో ప్రజలు విలాసాల కోసం కాదు, నిత్యావసరాలు తీర్చుకోవడానికే అప్పులు చేస్తున్నట్లు యూగవ్ సర్వే వెల్లడించింది. కిరాణా, అద్దె, వైద్య ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2025 నాటికి అమెరికా కుటుంబాల మొత్తం అప్పులు 18.8 ట్రిలియన్ డాలర్లకు చేరగా, పెరుగుతున్న జీవన వ్యయం ప్రజలను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోంది.
అమెరికాలో అప్పులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. విలాసవంతమైన జీవితం కోసం కాకుండా, నిత్యావసరాలు తీర్చుకోవడానికి, అనుకోని ఖర్చులను ఎదుర్కోవడానికే అప్పులు చేస్తున్నారని తాజా సర్వేలో బయటపడింది. దేశంలో నాలుగేళ్ల క్రితం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత కూడా ప్రజల బడ్జెట్లపై ఒత్తిడి కొనసాగుతోందని యూగవ్ సర్వే స్పష్టం చేస్తోంది. యూగవ్ సర్వే ప్రకారం, అమెరికాలో 58 శాతం మంది ప్రజలు క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు, వాహన రుణాల వంటి ఏదో ఒక రూపంలో అప్పులు కలిగి ఉన్నారు. నాలుగింట ఒక వంతు మందికి 10,000 డాలర్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ గణాంకాల ప్రకారం, 2025 నాలుగో త్రైమాసికం నాటికి అమెరికా కుటుంబాల మొత్తం అప్పుల భారం 18.8 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో క్రెడిట్ కార్డు అప్పులు 1.28 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రోజువారీ అవసరాలైన కిరాణా సరుకులు, యుటిలిటీ బిల్లులు, ఇంటి అద్దె చెల్లించడానికి, అలాగే ఆకస్మిక వైద్య ఖర్చులు లేదా వాహన రిపేర్ల వంటి అనుకోని ఖర్చుల కోసమే తాము అప్పులు చేస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. క్రెడిట్ కార్డు అప్పులున్న వారిలో 41 శాతం మంది అనుకోని ఖర్చుల వల్లే బకాయి పడినట్లు చెప్పగా, 33 శాతం మంది రోజువారీ ఖర్చుల కోసం కార్డులు వాడినట్లు తెలిపారు. 2022 నుంచి కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీసింది. దాంతో అనేక కుటుంబాలు పొదుపు చేయలేక, క్రెడిట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు సర్వేల ప్రకారం, అమెరికాలో కేవలం 30 నుంచి 47 శాతం మంది మాత్రమే 1,000 డాలర్ల అత్యవసర ఖర్చును భరించగల స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా రుణాల చెల్లింపుల్లో విఫలమయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారు అధిక జీవన వ్యయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చేస్తున్న అప్పులు వారి విలాసాలకు కాదని, జీవన పోరాటానికి అద్దం పడుతున్నాయని ఆ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు.. కొత్త రూల్ చూశారా?
జూన్ 8న ‘చేప ప్రసాదం’ ఈ ఏడాది రాత్రివేళ పంపిణీ
యువకుడికి అరగుండు, చెప్పుల దండతో ఊరేగింపు.. కారణం ఇదే
టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం
అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్ షాక్
ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి

