AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు

టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు

Phani CH
|

Updated on: May 23, 2026 | 11:07 AM

Share

ఏడాదికి రూ.19 లక్షల జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసిన 25 ఏళ్ల ఇంజనీర్ సౌరభ్ మిట్టల్ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడి, అనారోగ్యకరమైన వాతావరణం, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడంతో ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పాడు. మానసిక ప్రశాంతతే ముఖ్యమంటూ తీసుకున్న అతని నిర్ణయానికి నెటిజన్లు భారీగా మద్దతు తెలుపుతున్నారు.

బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం ప్రతీ యువకుడి కల. అది ఏ ఐటీ ఉద్యోగమో, ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగమో అయితే జీవితం సెటిల్ అన్నంతగా సంబరపడిపోతాడు. అయితే ఇటీవల యువ ఉద్యోగుల్లో ట్రెండ్‌ మారింది. జాబ్‌లో పని ఒత్తిడి కంటే, మానసిక ‍ప్రశాంతత ముఖ్యం అంటున్నారు. 22 ఏళ్ల వయసులో ఓ పెట్రోలియం సంస్థలో ఏడాదికి 19 లక్షల రూపాయల ప్యాకేజీ తో చేరి కొంతకాలానికే ఆ కుర్రాడు ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 25 ఏళ్ల ఇంజనీర్ సౌరభ్ మిట్టల్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌరభ్ మిట్టల్ ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరినప్పటికీ, అక్కడి పని వాతావరణం అతను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. తన ఆఫీసు వాస్తవానికి ఒక గిడ్డంగి లాంటిదని చెప్పాడు. అక్కడ తాగడానికి నీళ్లు కానీ, టాయిలెట్ కానీ లేవన్నాడు. చివరకు ఏసీ కూడా పాడైందని, దాన్ని తనే స్వయంగా బాగు చేసుకున్నట్లు చెప్పాడు. తన ఇల్లు సుమారు 10 నిమిషాల నడక దూరంలో ఉండటంతో రోజుకు చాలాసార్లు ఇంటికి వెళ్ళేవాడట. తను ఉద్యోగం మానేసే వరకు పరిస్థితి అలాగే ఉండేదని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అక్కడ పని పాతకాలపు పద్ధతుల్లో సాగేదని ఎక్కువ ఒత్తిడితో ఉందని విమర్శించాడు. సీనియర్ అధికారుల కోసం ఎయిర్‌పోర్ట్ పికప్‌లు, హోటల్ బుకింగ్‌లు వంటి వారి వ్యక్తిగత పనులను కూడా తనతో చేయించేవారట. అమ్మకాలు తగ్గినప్పుడు, ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేవారనీ వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాల్స్ సమయంలో తిట్టడం సర్వసాధారణమని అన్నాడు. ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ లోనూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవని చెప్పాడు. దీంతో లీవ్‌లు దొరకడం కష్టంగా ఉండేదని, ఇక ప్రమోషన్లు, జీతాల పెంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని పెదవి విరిచాడు.. తన తోటి ఉద్యోగులు పెద్ద వయసు వారు కావడంతో, అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి కానీ, కెరీర్ ఎదుగుదలకు కానీ పెద్దగా అవకాశం లేదనిపించింది అన్నాడు. జీవితాంతం ఇలాగే గడపడాన్ని తను ఊహించలేకపోయానని సౌరభ్ తన మనసులో మాట చెప్పాడు. ఉద్యోగాన్ని వదలేయాలన్న సౌరభ్‌ నిర్ణయాన్ని అమలు చేయడం అంత సులువు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే భద్రత, గౌరవం కారణంగా తండ్రి అతని నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే, కొడుకు పడుతున్న మానసిక ఒత్తిడిని గమనించిన తల్లి మాత్రం అతని నిర్ణయానికి మద్దతు పలికారట. సౌరభ్ మిట్టల్ కథనం ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడంతో ఆల్ ది బెస్ట్ అని చాలా మంది సౌరభ్‌ నిర్ణయాన్ని సమర్ధించారు. మంచి పని చేశావు, సోదరా”, “నీకు అంతా మంచే జరగాలి” అంటూ పలువురు సౌరభ్‌కు మద్దతుగా నిలిచారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు

పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం

అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్‌ షాక్‌

ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!

Follow Us