మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు నేరుగా పిడుగుపాటుకు గురై కూడా ప్రాణాలతో బయటపడటం సంచలనంగా మారింది. చేపలు పడుతుండగా చెట్టుపై పడిన పిడుగు విద్యుత్ అతడిని తాకినా, కేవలం 10 గంటల చికిత్సతో కోలుకున్నాడు. ఈ ఘటన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుండగా, ఉరుముల సమయంలో చెట్లు, నీటి వనరుల వద్ద ఉండొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుమారు 30 వేల డిగ్రీల సెల్సియస్ వేడి, గుండెను ఒక్క క్షణంలో ఆపేసే విద్యుత్ శక్తి.. ఇదీ పిడుగుపాటు తీవ్రత. అలాంటిది నేరుగా పిడుగుపాటుకు గురై కూడా ఓ 19 ఏళ్ల యువకుడు ప్రాణాలతో బయటపడటమే కాకుండా, కనీసం స్పృహ కూడా తప్పకుండా ఉండగలగడం అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన హంటర్ వైచ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఏంజెలీనా నది ఒడ్డున చేపలు పడుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్పుడు హంటర్ వైచ్ ఒక పెద్ద చెట్టును ఆనుకుని నిలబడ్డాడు. పిడుగులు ఎక్కువగా ఎత్తైన చెట్లపై పడతాయి. అతను ఆనుకుని ఉన్న చెట్టుపైనే పిడుగు పడింది. ఆ పిడుగు విద్యుత్ ధాటికి చెట్టు మొత్తం ముక్కలైంది. చెట్టులోని కొన్ని భాగాలు హంటర్ శరీరంలోకి వెళ్లాయి. పిడుగు విద్యుత్ శక్తి కూడా అతడిని తాకింది. భయంకరమైన విద్యుత్ శక్తి హంటర్ శరీరాన్ని తాకడంతో అతని కాళ్లలోని నరాలకు తీవ్ర నష్టం జరిగి, కొంతసేపు స్పర్శ లేకుండా పోయింది. సాధారణంగా పిడుగుపాటుకు గురైన వారు వినికిడి, జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా గుండె ఆగి చనిపోవడం జరుగుతుంది. కానీ, హంటర్ హ్యూస్టన్ ఆసుపత్రిలో కేవలం 10 గంటల చికిత్స పొంది కోలుకున్నాడు. ప్రమాదం జరిగిన 24 గంటలకే అతను మళ్లీ అదే నది ఒడ్డుకు వెళ్లడం విశేషం. “ప్రపంచంలోనే నేను దురదృష్టవంతుడైన అదృష్టవంతుడిని, మరణానికి అంగుళం దూరంలోకి వెళ్లి వచ్చాను” అని హంటర్ అన్నాడు. ఉరుములు వచ్చేటప్పుడు చెట్లు, నీటి వనరుల దగ్గర ఉండటం ప్రాణాంతకమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం
అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

