అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!
హిమాలయాల్లోని ఉత్తరాఖండ్ నుంచి భారతీయ ఆస్ట్రోఫోటోగ్రాఫర్ రమేశ్ భద్రి 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని ట్రయాంగులం గెలాక్సీని అద్భుతంగా చిత్రీకరించారు. సాధారణ టెలిస్కోప్‌తో తీసిన ఈ ఫోటోలో కొత్త నక్షత్రాలు పుడుతున్న ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖరీదైన పరికరాలు లేకపోయినా పట్టుదల ఉంటే అంతరిక్ష రహస్యాలను చేరుకోవచ్చని ఆయన నిరూపించారు.
ఆకాశంలో అద్భుతాలు చూడాలంటే నాసా వంటి పెద్ద సంస్థలకే సాధ్యమనుకుంటే పొరపాటే. పట్టుదల, సరైన ప్రదేశం ఉంటే ఓ సామాన్యుడు కూడా సుదూర పాలపుంతల రహస్యాలను ఛేదించగలడని ఓ భారతీయుడు నిరూపించాడు. రమేశ్ భద్రి అనే ఔత్సాహిక ఆస్ట్రోఫోటోగ్రాఫర్, హిమాలయాల్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రం, టెహ్రీ గర్వాల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఈ అద్భుతం సాధించాడు. తన వద్ద ఉన్న ఓ కాంపాక్ట్ టెలిస్కోప్‌తో ఏకంగా 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రయాంగులం గెలాక్సీ ఎన్జీసీ 598ని అద్భుతంగా ఫోటో తీశాడు. ఆ ఫోటోలో ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే, ఆ గెలాక్సీలో కనిపిస్తున్న కాంతి భూమిని చేరడానికి సుమారు 27 లక్షల సంవత్సరాలు పట్టింది. ఆ కాలంలో భూమిపై ఇంకా ఆదిమ మానవుల ఆనవాళ్లు కూడా లేవు. భద్రి తీసిన చిత్రంలో గెలాక్సీలోని గులాబీ రంగు ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి కొత్త నక్షత్రాలు పుడుతున్న ప్రాంతాలనీ, వాటిని ‘స్టార్ ఫార్మింగ్ రీజన్లు’ గా పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ట్రయాంగులం గెలాక్సీ మన పాలపుంత, ఆండ్రోమెడా గెలాక్సీలతో ఉన్న ‘లోకల్ గ్రూప్’లో మూడో అతిపెద్దది. ఇందులో సుమారు 400 కోట్ల నక్షత్రాలు ఉంటాయని అంచనా. నగరాల్లోని కాంతి కాలుష్యం లేని హిమాలయాల చీకటి ఆకాశంలో, ప్రత్యేక ఫిల్టర్లు వాడి, గంటల తరబడి ఓపికగా ఆ ఫొటోను బంధించినట్లు రమేశ్ తెలిపారు. ఆయన సాధించిన ఈ ఘనత.. ఖరీదైన పరికరాలు లేకపోయినా, పట్టుదలతో అంతరిక్ష సౌందర్యాన్ని ఎవరైనా ఆస్వాదించవచ్చని నిరూపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పూట గడవడానికి అప్పులు! అమెరికన్ల కష్టాలపై సర్వే!
ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు.. కొత్త రూల్ చూశారా?
జూన్ 8న ‘చేప ప్రసాదం’ ఈ ఏడాది రాత్రివేళ పంపిణీ
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

