AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం

ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 23, 2026 | 2:00 PM

Share

నంద్యాల బొగ్గులైన్ ప్రాంతంలో ఓ ఇంట్లో భారీ నాగుపాము కనిపించడం స్థానికుల్లో భయాందోళన కలిగించింది. తీవ్ర ఎండల కారణంగా చల్లని ప్రదేశాల కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ చాకచక్యంగా నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాము కనిపిస్తే దాడి చేయకుండా వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

అసలే‌ భగ్గు మంటున్న ఎండలు ప్రజలే ఉక్కపోతకు తట్టుకోలేక తల్లడిల్లి పోతున్నారు.ఇక పొలాల్లో చెట్ల పొదోల్లో ఉండాల్సిన విషసర్పాలు జనావాల మద్య సంచరిస్తూ సేద తీరుతున్నాయి.ఇంటి బయటకు పోతే ఉక్కపోత ఇంట్లోకి వెళితే విషసర్పాల తాకడి ఇది నంద్యాల బొగ్గులైన్ వాసుల పరిస్థితి. నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ ప్రాంతంలో శుక్రవారం ఊహించని ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సాధారణంగా పొలాలు, చెట్ల పొదలు, కాలువల వద్ద కనిపించే విషసర్పాలు ఇప్పుడు నేరుగా నివాస గృహాల్లోకి ప్రవేశిస్తుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బొగ్గులైన్‌లోని ఓ ఇంట్లో భారీ నాగుపాము సంచరించడం కలకలం రేపింది. ఇంటి కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా గదిలో నాగుపాము కనిపించడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. పాము ఇంటి మూలల్లో తిరుగుతూ పడగ విప్పడంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షణాల్లోనే ఈ విషయం పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో అందరిలోనూ భయం నెలకొంది. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ రజాక్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రజాక్ అత్యంత అప్రమత్తంగా పరిస్థితిని అంచనా వేశారు. ఇంటి వెనుక భాగంలో దాక్కున్న నాగుపామును జాగ్రత్తగా బయటకు తీసి చాకచక్యంగా పట్టుకున్నారు. కొంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొనగా చివరికి పాము పట్టుబడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొంతకాలంగా పాములు తరచూ జనావాసాల్లోకి వస్తుండటం భయాందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు పొలాల్లో మాత్రమే కనిపించే పాములు ఇప్పుడు ఇళ్లలోకి రావడానికి ప్రధాన కారణం తీవ్రవైన ఎండలే కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. వేసవి కాలంలో నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాములు చల్లని ప్రదేశాల కోసం జనావాసాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎలుకలు అధికంగా ఉన్న ప్రాంతాలు పాములకు ఆహార కేంద్రాలుగా మారుతున్నాయని చెబుతున్నారు. పట్టుకున్న నాగుపామును అనంతరం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టడంతో బొగ్గులైన్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్బంగా స్నేక్ క్యాచర్ రజాక్ బొగ్గులైన్ వాసులకు పలు సూచనలు చేశారు. పాము కనిపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దానిపై దాడి చేయరాదని,భయంతో కొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. వెంటనే సర్పాల పట్టడంలో నైపుణ్యం కలిగిన వారికి సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాణాపాయం తప్పించుకోవచ్చన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..

వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్‌ రిపోర్ట్‌ చూసి డాక్టర్స్‌ షాక్‌!

మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత వీర బాదుడే!

అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!

పూట గడవడానికి అప్పులు! అమెరికన్ల కష్టాలపై సర్వే!

Published on: May 23, 2026 01:55 PM
Follow Us