AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బండి సంజయ్‌ అంటే ధర్మపురి అర్వింద్‌కు పడదా..? అసలేం జరుగుతోంది.. సంచలన ఇంటర్వ్యూ

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్ మధ్య నిజంగా గ్యాప్ ఉందా? ఒకే పార్టీలో ఉన్న కీలక నేతల మధ్య అసలేం జరుగుతోంది? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shaik Madar Saheb
|

Updated on: May 23, 2026 | 7:25 PM

Share

బండి సంజయ్‌ అంటే ధర్మపురి అర్వింద్‌కు పడదా? ఒకే పార్టీలో ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య అసలేం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ గెలవలేదంటే.. ధర్మపురి అర్వింద్ సహా అందరూ ఫెయిల్ అయినట్టేనా? స్థానిక నాయకుల్లో ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది..? టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో.. ఈ అంశాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు.. కొట్లాటలు, ఎక్కువగా ఉన్నాయా? ముఖ్యనేతలంతా ఎవరి గేమ్ వాళ్లు అడుతున్నారా? బీఆర్ఎస్ ముఖ్యనేతలను, కేసీఆర్ కుటుంబసభ్యులను బీజేపీలోకి తీసుకొస్తున్నారనే ప్రచారంలో నిజమెంత? తెలంగాణ బీజేపీకి నిజంగానే అలాంటి అవసరం ఉందా? అనే ప్రశ్నలకు ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.. అంతేకాకుండా.. తెలంగాణ రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులు, పొలిటికల్ వార్ సహా.. అనేక విషయాలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడారు.

ఇంటర్వ్యూ ఫుల్‌ ఎపిసోడ్‌ను లైవ్ వీడియోలో చూడండి..

Follow Us