వాళ్ల వల్లే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను: హీరోయిన్ శ్రీలీల

19 August 2026

Basha Shek

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ సెన్సేషన్, హీరోయిన్  శ్రీలీల.

'పెళ్లి సందడి'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా రవితేజ 'ధమకా'తోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.

అయితే గత కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ హిట్ పడంలేదు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడుతున్నాయి.

అయినా ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది తమిళంలో పరాశక్తి, తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేసింది శ్రీలీల.

ప్రస్తుతం ధనుష్‌కు జంటగా 'ఓం' అనే  సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు ఆమె  హిందీ లో నటించిన మూవీ కూడా రిలీజ్ కానుంది.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీలీల అభిమానుల ప్రేమ కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అభిమానులని ప్రత్యక్షంగా కలిసినప్పుడు వారు చూపించే ఆదరాభిమానాలు తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటోంది శ్రీలీల

నేను డబ్బు సంపాదిస్తున్నప్పుడు, పేరు తెచ్చుకున్నప్పుడు కూడా ఇంత సంతోషపడలేదు. అభిమానులు వల్ల మాత్రమే అంతా సాధ్యమైందని ఎమోషనల్ అయ్యిందీ ముద్దుగుమ్మ.