ఒంట్లో శక్తిని పెంచి.. ఎములకు బలాన్ని ఇచ్చే లడ్డూ.. రోజూ ఒక్కటి తింటే మీరు తిరుగులేనట్టే!
శ్రీ కృష్ణ జయంతి వచ్చేసింది. స్వామికారికి ఇష్టమైన నైవేద్యం పెట్టేందుకు భక్తులు రకరకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ రోటీన్‌గా కాకుండా ఈ జన్మాష్టమికి టేస్టీ టేస్టీగా ఉండే ఆటుకుల లడ్డూను చేసి పెట్టండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ మృదువైన లడ్డూను మీరు ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరీ ఈ లడ్డూను ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి.

శ్రీకృష్ణాష్టమి వచ్చేసింది. భక్తులందరూ తమ ఆరాధ్య దైవమైన కన్నయను పూజించేందుకు ప్రత్యేమైన స్వీట్లను తయారు చేస్తారు. వాటిని భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి తమ కోరికలను తీర్చమని కోరుతారు. కొందరు తమ పిల్లలకు ఆ చిన్ని కృష్ణుడి వేశం వేసి వారిలోనే దైవాన్ని చూసుకుంటారు. అయితే ఈ జన్మాష్టమికి మీ చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన స్వీట్లలో ఒకటైన అటుకుల లడ్డూను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో చూద్దాం.
అటుకుల లడ్డూకు కావలసిన పదార్థాలు
- అటుకులు
- బెల్లం తరుగు
- వేరుశెనగ గుళ్లు
- జీడిపప్పు
- ఎండు కొబ్బరి పొడి
- యాలకుల పొడి
- నెయ్య
- నీళ్లు
అటుకుల లడ్డూ తయారీ విధానం
అటుకుల లడ్డూ తయారు చేసేందుకు ముందుగా ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి తర్వాత జీడిపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొన్ని వేరుశెనగ గుళ్లు, అటుకులను కూడా వేసి విడివిడిగా వేయించి చల్లారనివ్వండి.
ఇప్పుడు వేయించిన జీడిపప్పు, యాలకులను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేయండి. తర్వాత చల్లారిన వేరుశెనగ గుళ్లు, అటుకులను కూడా విడివిడిగా పొడి చేసి, వాటన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా కలపండి. అలాగే మరో గిన్నెలో బెల్లం తరుగు, పావు కప్పు నీళ్లు పోసి కరిగించి, నలకలు లేకుండా వడకట్టండి.
ఇప్పుడు పాన్‌లో మరో రెండు చెంచాల నెయ్యి వేడి చేసి, ఎండు కొబ్బరి పొడిని కొద్దిగా వేయించండి. ఆ తర్వాత అందులోనే వడకట్టిన బెల్లం పాకం, ముందుగా సిద్ధం చేసుకున్న అటుకుల-పప్పుల మిశ్రమం వేసి బాగా కలపండి. ఆ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే, వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి చేతులతో చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే అటుకుల లడ్డూ రెడీ అయినట్టే. వీటిని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించిన తర్వాత మీరు తిని ఈ జన్మాష్టమిని మరింత స్పెషల్‌గా మార్చుకోండి.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
