Viral Video: వాచ్‌మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
విశాఖపట్నం పెందుర్తిలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఐదు అడుగుల భారీ గోధుమ నాగుపాము కలకలం సృష్టించింది. వాచ్‌మెన్ కుటుంబం నివసించే గదిలోకి ప్రవేశించిన పామును చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ అక్కడికి చేరుకుని పామును రక్షించే ప్రయత్నం చేశారు. పడగ విప్పి ఎదురు తిరిగినప్పటికీ చాకచక్యంగా దానిని సురక్షితంగా బంధించారు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆహారంకోసమో..ఆవాసం కోసమో ఇటీవల పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ఐదు అడుగుల పొడవున్న ఆ గోధుమ నాగును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెందుర్తిలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్ కుటుంబం నివసించే గదిలోకి ఈ గోధుమ నాగు ప్రవేశించింది. ఏదో కదులుతున్నట్లు అనిపించి పరిశీలించిన వాచ్‌మెన్‌కు భారీ నాగుపాము కనిపించడంతో గుండె గుభేలుమంది. వెంటనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించగా, వారు వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌ను రప్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ వాచ్‌మెన్ గదిలోకి వెళ్లి పామును రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన దానిని పట్టుకునే ప్రయత్నం చేయగానే ఆ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ ఎదురు తిరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఆ పామును కిరణ్ కుమార్ అత్యంత చాకచక్యంగా సురక్షితంగా బంధించారు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు, వాచ్‌మెన్ కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు. గోధుమ నాగు అత్యంత విషపూరితమైన పాము జాతులకు చెందింది. భారతదేశంలో అత్యధిక పాముకాటు మరణాలకు కారణమయ్యే “బిగ్ ఫోర్” సర్పాల జాతులలో ఇది ఒకటి. నివాస ప్రాంతాల వైపు ఇలాంటి విషసర్పాలు వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్లూ, వైట్ ఆధార్ కార్డుల మధ్య తేడాలేమిటి.. ఏ కార్డ్ ఎవరికి?
ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!
ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..
అదుపు తప్పి బావి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు…!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

