ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!
నేపాల్ నుంచి వస్తున్న వరద నీటితో బీహార్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. వరదల్లో కొట్టుకొచ్చే అసాధారణ, గుర్తుతెలియని చేపలను తినవద్దని సూచించింది. మురుగునీరు, రసాయనాలు, జంతువుల వ్యర్థాలతో నీరు కలుషితం కావడంతో చేపలు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వైరల్ అవుతున్న భారీ క్యాట్‌ఫిష్‌లను కూడా కొనడం, అమ్మడం, తినడం చేయొద్దని హెచ్చరించారు.
నేపాల్ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్‌కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గండక్ నది పరివాహక ప్రాంతాల్లో భారీ చేపలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసాధారణ క్యాట్‌ఫిష్‌లను చూసి ఎవరూ మోసపోవద్దని స్పష్టం చేశారు. కుళ్లిన లేదా వరదల్లో దొరికిన చేపలను అమ్మడం, కొనడం, తినడం వంటివి పూర్తిగా నిషేధించారు. సరైన గుర్తింపు, భద్రతా నిర్ధారణ లేని ఇలాంటి చేపలను తింటే బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. పొరపాటున వాటిని తిని వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురైతే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం పొందాలని సూచించారు. అసాధారణ చేపలు ఎక్కడైనా కనిపిస్తే స్థానిక మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..
అదుపు తప్పి బావి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు…!
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

