AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు

ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు

Phani CH
|

Updated on: Sep 03, 2026 | 3:49 PM

Share

పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చేగొండపల్లి సమీపంలో పులి కదలికలను ట్రాకర్లు గుర్తించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్లతో గాలింపు చేపట్టినా దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా ఆచూకీ లభించలేదు. పులిని సురక్షితంగా బంధించేందుకు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 350 మందికి పైగా సిబ్బంది అన్వేషణలో పాల్గొంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఆహారం, నీరు పుష్కలంగా లభిస్తుండటంతో పులి అక్కడే తిష్ట వేసింది. ముంపు గ్రామం చేగొండపల్లి సమీపంలో పులి కదలికలను ట్రాకర్స్ గుర్తిచారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై చేగొండపల్లి, మెత్తప్పుకోట కొండల్లో డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఆ ప్రాంతంలో చెట్లు దట్టంగా ఉండటంతో డ్రోన్ కెమెరాలకు పులి ఆచూకీ చిక్కలేదు. పులిని సురక్షితంగా బంధించేందుకు నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అటవీశాఖ అధికారులతో పాటు మొత్తం 350 మందికి పైగా సిబ్బంది పులి అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పోలవరం, రామయ్యపేట, చంద్రన్నకాలనీ, ఇటుకలకోట గ్రామాల్లో అధికారులు డప్పు చాటింపు వేయించారు. ఉడతపల్లి, వింజరం, సున్నాలగొంది పరిసర గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు, కూలీలు ఎవరూ అడవి సరిహద్దుల వైపు వెళ్లవద్దని, పశువులను మేతకు తీసుకెళ్లొద్దని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !

పెళ్లి వేడుకపై అమెరికా భీకర దాడి.. ‘బిగ్గెస్ట్ అటాక్’ ఇంకా మిగిలే ఉంది.. ట్రంప్ సంచలన వార్నింగ్

ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్‌ తల్లికి RGV కౌంటర్

Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!

Jailer 2: విజయ్‌ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ

Follow Us