ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..
ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇకపై గాయాల నుంచి కోలుకున్న ఆటగాళ్లను ఎంపిక చేసే ముందు వారి ఫిట్‌నెస్‌పై మరింత స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 100 శాతం కాదు.. ‘200 శాతం’ నమ్మకం కుదిరితేనే పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణిస్తారు. బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాల ఫిట్‌నెస్‌ను అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు ముందు పరిశీలించనున్నారు.
ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో మరింత స్పష్టతతో వ్యవహరించాలని బోర్డు నిర్ణయించింది. ఇటీవల గాయాలపాలైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి సమస్యలకు పుల్ స్టాప్ పెట్టేందుకు బీసీసీఐ సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై కేవలం 100 శాతం కాకుండా ‘200 శాతం’ నమ్మకం కుదిరితేనే వారిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించనున్నారు. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు బీసీసీఐ ఫిట్‌నెస్ షరతులు విధించింది. గాయాల నుంచి వీరు పూర్తిగా కోలుకున్నారనే స్పష్టత వచ్చిన తర్వాతే తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఎంపిక తేదీనాటికి ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి అందుబాటులోకి వస్తే వారిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ ఎంపిక చేసే పద్ధతిని కొనసాగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించారు. తాజా నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ తొలి మ్యాచ్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్‌ల ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదుపు తప్పి బావి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు…!
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్ ఫైర్ !
పెళ్లి వేడుకపై అమెరికా భీకర దాడి.. ‘బిగ్గెస్ట్ అటాక్’ ఇంకా మిగిలే ఉంది.. ట్రంప్ సంచలన వార్నింగ్
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

