అదుపు తప్పి బావి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు…!
కరీంనగర్ జిల్లాలో 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లి అంచునే ఆగిపోయింది. బస్సు బావిలో పడి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా, మిగతావారిని పోలీసులు, అధికారులు సురక్షితంగా బయటకు తరలించారు.
కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. కరీంనగర్ నుంచి 54 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారుకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న ప్రమాదకరమైన వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లి సరిగ్గా అంచున నిలిచిపోయింది. కొంచెం ఉంటే బస్సు బావిలో పడిపోయేది. చిన్నపాటి పట్టుతో బావి అంచున బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు కాస్త అటూఇటూ అయి ఉంటే బావిలో పడి భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్ ఫైర్ !
పెళ్లి వేడుకపై అమెరికా భీకర దాడి.. ‘బిగ్గెస్ట్ అటాక్’ ఇంకా మిగిలే ఉంది.. ట్రంప్ సంచలన వార్నింగ్
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

