ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మలేరియా నివారణకు ఇచ్చిన క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న తర్వాత ఏడేళ్ల చిన్నారి మడివి జమున మృతి చెందింది. మరో 50 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వీరి వయసు 2 నుండి 10 సంవత్సరాల మధ్య ఉంది. ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.