AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయోమెట్రిక్ ఇస్తే మీ ఖాతా ఖాళీ! అలర్ట్‌!

బయోమెట్రిక్ ఇస్తే మీ ఖాతా ఖాళీ! అలర్ట్‌!

Phani CH
|

Updated on: Sep 03, 2026 | 7:40 PM

Share

యూఏఈలోని భారతీయులు, ముఖ్యంగా బ్లూకాలర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వీసా, ఉద్యోగం, ఎగ్జిట్‌ పర్మిట్‌, ఎమిరేట్స్‌ ఐడీ పేరుతో సహాయం చేస్తామని చెప్పే అనధికార ఏజెంట్లను నమ్మవద్దని సూచించింది. బయోమెట్రిక్‌ వివరాలను వారికి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. నకిలీ ఏజెంట్లు ఈ డేటాతో బ్యాంకు ఖాతాలు, రుణాలు, క్రెడిట్‌ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న భారతీయులను, ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వీసా క్రమబద్ధీకరణ, ఉపాధి, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్స్ ఐడీల పేరుతో సహాయం చేస్తామని నమ్మబలికే అనధికారిక ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏజెంట్ల మాయలో పడి తమ బయోమెట్రిక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. నకిలీ ఏజెంట్లు.. బాధితుల అనుమతి మరియు ప్రమేయం లేకుండానే వారి బయోమెట్రిక్ డేటాను సేకరించి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఆ డేటాను ఉపయోగించి దొంగచాటుగా బ్యాంకు ఖాతాలు తెరవడం, అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు పొందడం వంటి చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీనివల్ల అమాయక ప్రవాస భారతీయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. వీసా మార్పులు లేదా ఎమిరేట్స్ ఐడీ పనుల కోసం ఎవరైనా బయోమెట్రిక్ స్కాన్ చేయాల్సి వస్తే, ఆ వివరాలను కేవలం అధికారిక యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు లేదా అధీకృత కౌంటర్లలో మాత్రమే ఇవ్వాలని ఎంబసీ స్పష్టం చేసింది. భారత రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్లు పాస్‌పోర్టులు, అత్యవసర ధ్రువపత్రాల జారీ కోసం వేలిముద్రలు, ముఖం లేదా ఐ స్కాన్‌లను ఎప్పుడూ సేకరించవని స్పష్టం చేసింది. అనధికార వ్యక్తులు ఎవరైనా ఎంబసీ పేరుతో బయోమెట్రిక్ డేటా అడిగితే నమ్మవద్దని కోరింది. ఎలాంటి సందేహాలు ఉన్నా, మోసాలకు గురవుతున్నట్లు అనిపించినా ప్రవాసీ భారతీయ సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. ఇందుకోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 80046342, వాట్సప్/ఎస్‌ఎంఎస్ నంబర్ 00971543090571 లేదా pbsk.dubai@mea.gov.in ఈమెయిల్ ద్వారా సంప్రదించి వివరాలను ధ్రువీకరించుకోవాలని ఎంబసీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: వాచ్‌మెన్‌ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది

బ్లూ, వైట్ ఆధార్ కార్డుల మధ్య తేడాలేమిటి.. ఏ కార్డ్‌ ఎవరికి?

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..

Follow Us