భారత సైన్యం రివర్ క్రాసింగ్ శిక్షణలో ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంతో ఐదుగురు జవాన్లు కొట్టుకుపోయారు. సైనిక బృందాలు వెంటనే స్పందించి ముగ్గురిని కాపాడాయి. గల్లంతైన మరో ఇద్దరు కమాండోల కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది.