AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణుడి భక్తిలో మైమరిపించే ‘అచ్యుతం కేశవం'.. తెలుగులో తొలిసారి!

కృష్ణుడి భక్తిలో మైమరిపించే ‘అచ్యుతం కేశవం’.. తెలుగులో తొలిసారి!

Ram Naramaneni
|

Updated on: Sep 03, 2026 | 5:43 PM

Share

శ్రీకృష్ణుడి భక్తిరసాన్ని చాటిచెప్పే ‘అచ్యుతం కేశవం’ గీతం తెలుగులో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీప్తి వాజపేయి సాహిత్యం, సంగీతం, గాత్రంతో రూపొందించిన ఈ భక్తిగీతం మధురమైన సంగీతం, ఆధ్యాత్మిక భావాలతో ఆకట్టుకుంటోంది. TV9 తెలుగు సమర్పణలో వచ్చిన ఈ పాట కృష్ణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అచ్యుతం కేశవం భజన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని దివ్య గుణాలను, ఆయన అపారమైన మహిమను కీర్తించే ఒక ప్రసిద్ధ భక్తి గీతం. శ్రీకృష్ణుడు అచ్చుతాష్టకం నుంచి నుంచి స్ఫూర్తి పొంది.. దీన్ని టీవీ9 తెలుగు ఎక్స్‌క్లూజీవ్‌గా రూపొందించడం జరిగింది.

ఈ పాట కృష్ణుని అనేక నామాలను స్మరిస్తూ, భక్తులకు ఆయన ఎంత సులభంగా అందుబాటులో ఉంటాడో, వారి ఆర్తనాదాలను ఎలా ఆలకిస్తాడో ఆకర్షణీయమైన రీతిలో వివరిస్తుంది. తెలుగులో మొట్టమొదటిసారిగా రూపొందించబడిన ఈ భజన, భక్తుల హృదయాలను స్పృశించే విధంగా మధురంగా సాగుతుంది. ఈ భజన అచ్యుతం, కేశవం, రామనారాయణం, దామోదరం, వాసుదేవం, హరి, శ్రీధరం, మాధవం, గోపికా వల్లభం, జానకీ నాయకం, రామచంద్రం వంటి శ్రీకృష్ణుని దివ్య నామాలను నిరంతరం జపిస్తుంది. ఈ నామాలు కృష్ణుని విశ్వరూపాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని, భక్తుల పట్ల ఆయన ప్రేమను తెలియజేస్తాయి. ప్రతి నామం వెనుక ఒక గొప్ప అర్థం, ఒక కథ దాగి ఉంటుంది. ఈ పాట భగవంతుని నామస్మరణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ గీతం “ఎవరన్నారు ఆ స్వామి రాడేయని?” అనే ప్రశ్నతో ప్రారంభమై, శ్రీకృష్ణుడు భక్తుల పిలుపునకు ఎలా స్పందించాడో వివరించే అద్భుతమైన సన్నివేశాలను అందిస్తుంది.

మధురమైన సాహిత్యం, ఆధ్యాత్మిక భావాన్ని నింపే సంగీతం, భక్తితో కూడిన గాత్రంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ భజన గీతానికి టీవీ9 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దీప్తి వాజపేయి సాహిత్యం, సంగీతం, గాత్రాన్ని అందించగా.. గురు ప్రసాద్ ఒగిరాల, సాయి నారాయణ ఒగిరాల వాద్య సహకారం అందించారు.

అచ్యుతం కేశవం నామస్మరణతో శ్రీకృష్ణుడి రూపాన్ని ఆవిష్కరించేలా రూపొందించిన ఈ పాటకు సురేశ్ సర్వేపల్లి కాన్సెప్ట్ అందించారు. అచ్యుత కుమార్, శ్రీధర్ కెమెరా పనితనం, లియాఖత్ అలీ, మనోజ్, రమేశ్ గ్రాఫిక్స్, మల్లికార్జున్ పాల్వాయి, సతీశ్ చంద్ర ఎడిటింగ్‌తో పాటకు మరింత అందం చేకూరింది. TV9 తెలుగు సమర్పణలో వచ్చిన ఈ భక్తిగీతం కృష్ణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Published on: Sep 03, 2026 05:42 PM
Follow Us