AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 206: 933 బంతుల్లో 100 సిక్సర్లు.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ జిగిరీ దోస్త్..!

Fastest 100 IPL Sixes: ఐపీఎల్ చరిత్రలో వెస్టిండీస్ బ్యాటర్ల పవర్‌హిట్టింగ్‌కు తిరుగులేదని ఈ జాబితా స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, కరీబియన్ దిగ్గజాల మధ్య రజత్ పటిదార్ లాంటి భారతీయ సాంకేతిక బ్యాటర్ తనదైన శైలిలో సిక్సర్ల వీరుడిగా ఎదగడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ యువ ఆటగాడు మరిన్ని రికార్డులను తిరగరాయాలని ఆశిద్దాం.

IPL 206: 933 బంతుల్లో 100 సిక్సర్లు.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ జిగిరీ దోస్త్..!
Rajat Patidar
Venkata Chari
|

Updated on: May 23, 2026 | 5:46 PM

Share

Fastest 100 IPL Sixes: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే బౌండరీల మోత, సిక్సర్ల సునామీ. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో వంద సిక్సర్ల మైలురాయిని అందుకున్న టాప్-5 విధ్వంసకర బ్యాటర్ల జాబితా తాజాగా విడుదలైంది. వెస్టిండీస్ పవర్‌హిట్టర్ల ఆధిపత్యం ఉన్న ఈ చారిత్రాత్మక జాబితాలోకి భారత యువ సంచలనం రజత్ పటిదార్ చేరి సంచలనం సృష్టించాడు.

సిక్సర్ల వేటలో ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానం..

క్రీజులోకి వస్తే చాలు బంతిని స్టేడియం దాటించడమే లక్ష్యంగా పెట్టుకునే కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. తన కండబలంతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే రస్సెల్, ఐపీఎల్‌లో కేవలం 657 బంతుల్లోనే వంద సిక్సర్ల మార్కును దాటి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. టి20 క్రికెట్‌లో అతడి విధ్వంసానికి ఈ గణాంకాలే నిలువెత్తు నిదర్శనం.

ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..

రెండో స్థానంలో పూరన్.. మూడో స్థానంలో భారతీయుడు

ఇక ఈ విలక్షణమైన రికార్డులో లక్నో సూపర్ జాయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ 884 బంతులతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ప్రస్తుత సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నయా స్టార్ రజత్ పటిదార్. కేవలం 933 బంతుల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న పటిదార్, ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా మైదానం నలుమూలలా సిక్సర్లు బాదగల నైపుణ్యం అతడిని ఈ స్థానంలో నిలబెట్టింది.

టాప్-5 లో నిలిచిన దిగ్గజాలు వీరే..

ఈ చార్టులో మిగిలిన స్థానాలను పరిశీలిస్తే అంతా టీ20 ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలే కనిపిస్తారు.

ఆండ్రీ రస్సెల్: 657 బంతులు (మొదటి స్థానం)

నికోలస్ పూరన్: 884 బంతులు (రెండో స్థానం)

రజత్ పటిదార్: 933 బంతులు (మూడో స్థానం)

క్రిస్ గేల్: 943 బంతులు (నాలుగో స్థానం)

సునీల్ నరైన్: 950 బంతులు (ఐదో స్థానం)

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లో మరో కొత్త ఫ్రాంచైజీ.. ఒకే టీంలోకి ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ? రంగంలోకి భారతీయ బిలియనీర్!

యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 943 బంతుల్లో ఈ మైలురాయిని అందుకోగా, కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ 950 బంతులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ లాంటి మహా ముదురు బ్యాటర్‌ను పటిదార్ వెనక్కి నెట్టడం భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?