షిరిడీ సాయి సన్నిధిలో రామ్ చరణ్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ షిరిడీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా గౌరవించారు. దర్శనం అనంతరం సాయిబాబా ప్రతిమను బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న RC17 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఇవాళ షిరిడీ వెళ్లిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనను గౌరవించారు. రామ్ చరణ్‌కు సాయిబాబు ప్రతిమను బహుమానంగా అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది పెద్ది మూవీతో ప్రేక్షకులను అలరించాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్.. సుకుమార్ డైరెక్టర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ17 సినిమా రానుంది. ఇటీవలే పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. రంగస్థలం తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramayana: 8 రోజుల్లో వెయ్యి కోట్లు.. కొత్త రికార్డ్ సెట్ చేసిన ‘రామాయణ’
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
సెహ్వాగ్ కొడుక్కి.. కోహ్లీ సలహా ఇదే.. వైరల్ అవుతున్న ఆర్యవీర్ పాత ఇంటర్వ్యూ
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. 54 ప్రత్యేక రైళ్లు!
ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!

