AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. 54 ప్రత్యేక రైళ్లు!

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. 54 ప్రత్యేక రైళ్లు!

Phani CH
|

Updated on: Nov 14, 2026 | 6:46 PM

Share

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 54 ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. నవంబర్ 15 నుంచి 2027 జనవరి 19 వరకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ నుంచి కేరళలోని కొల్లంకు ఈ రైళ్లు నడవనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు తేదీలు, సమయాలను ముందుగానే పరిశీలించుకోవాలి.

అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు మొత్తం 54 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లం వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ – కొల్లం: 07193 నంబర్ రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:15 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07194 రైలు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 10:55 గంటలకు కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. చర్లపల్లి – కొల్లం 07180 నెంబరు రైలు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11:45 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:55 గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10:55 గంటలకు కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చర్లపల్లి – కొల్లం 07195 నెంబరు రైలు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 మరియు 2027 జనవరి 3, 10, 17 తేదీల్లో రాత్రి 11:45 గంటలకు చర్లపల్లి నుంచి కొల్లం వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో 07196 రైలు నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో ఉదయం 10:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 07197 రైలు డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో చర్లపల్లి నుంచి, 17198 రైలు డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో కొల్లం నుంచి నడుస్తుంది. అలాగే 07199 రైలు డిసెంబర్ 30, జనవరి 6, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి, 07200 రైలు జనవరి 1, 8, 15 తేదీల్లో కొల్లం నుంచి బయలుదేరుతుంది. అదనంగా నవంబర్ 15న నాందేడ్ నుంచి కొల్లంకు (07189), నవంబర్ 17న కొల్లం నుంచి చర్లపల్లికి (17190) ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!

వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్

పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ సెక్యూరిటీ!

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. గుండెకు ముప్పు తప్పదు!

ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. పండ్లు, పాలు కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి!

Follow Us