రాయామయణ సినిమాకు మహేష్ కొడుకు.. దిమ్మతిరిగిపోయే రివ్యూ
సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ‘రామాయణ’ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చాడు. ఈ చిత్రంలోని విజువల్స్, స్క్రిప్ట్, దర్శకత్వం, నటీనటుల పనితీరును ప్రశంసించాడు. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. రణ్‌బీర్ కపూర్ నటనను కూడా మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఈ మధ్య … సినిమాల్లోకి రాక ముందే బాగా హైలెట్ అవుతున్నాడు. రీసెంట్‌గా సినిమాలకు తన స్టైల్లో రేటింగ్ లు, రివ్యూలు ఇస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇటీవల నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి షాకింగ్ రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచిన గౌతమ్.. తాజాగా రామాయణ సినిమాపై కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇప్పటివరకు చాలా సినిమాలు చాలా తక్కువ రేటింగ్ ఇచ్చిన గౌతమ్ ‘రామాయణ’ సినిమాకు మాత్రం 4.5 రేటింగ్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు ఈ సినిమా తనను ఎంతో ఆశ్చర్యపరిచిందంటూ ప్రశంసలు కురిపించాడు గౌతమ్. ‘రామాయణ’ సినిమా చూశాక నా మనసు పూర్తిగా కరిగిపోయిందని.. మాటలు రావడం లేదని.. ఇందులో CGI, స్క్రిప్ట్, డైరెక్షన్, నటన అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయని తన పోస్టులో రాసుకొచ్చాడు గౌతమ్. ఇక రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఎప్పటిలాగే అద్భుతమైన నటన కనబరిచారని.. కానీ రావణాసురుడిగా యశ్ నన్ను మరింతగా ఆకట్టుకున్నాడంటూ గౌతమ్ తన పోస్టులో రాసుకొచ్చాడు. యశ్ నటన అసాధారణం, అద్భుతం అంతే! ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. భారతీయ సినిమా సత్తా ఏంటో చాటిచెప్పే ఒక నిజమైన నిదర్శనం ఈ రామాయణం చిత్రం’ అంటూ తన రివ్యూలో రామాయణ సినిమాను అందులో యశ్ యాక్టింగ్‌ను ఆకాశానికెత్తేశాడు గౌతమ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాయిపల్లవి, విజయ్ సేతుపతి జోడీగా మణిరత్నం కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
పండితుడు లేకుండా ‘ఆత్మ గౌరవ’ పద్దతిలో పెళ్లి.. ఈ పెళ్లి ఎలా చేస్తారంటే..
షిరిడీ సాయి సన్నిధిలో రామ్ చరణ్.. వీడియో వైరల్
Ramayana: 8 రోజుల్లో వెయ్యి కోట్లు.. కొత్త రికార్డ్ సెట్ చేసిన ‘రామాయణ’
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!

