Video: వాడిని ఆపండ్రోయ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..
Kavya Maran Angry Reaction: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య విసిరిన విచిత్రమైన బౌలింగ్ డెలివరీలపై ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Krunal Pandya illegal Bowling Action: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లను చీల్చిచెండూడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. అయితే ఈ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో ఆర్‌సీబీ తరపున బౌలింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య వేసిన కొన్ని బంతులు మ్యాచ్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కృనాల్ పాండ్య విచిత్ర బౌలింగ్.. కావ్య మారన్ ఆగ్రహం..
సాధారణంగా కృనాల్ పాండ్య లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయినప్పటికీ, అప్పుడప్పుడు బ్యాటర్లను అయోమయానికి గురి చేయడానికి విచిత్రమైన యాక్షన్‌తో బౌలింగ్ చేస్తుంటాడు. ఈ మ్యాచ్‌లో కూడా కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన కృనాల్, స్పిన్ వేయాల్సింది పోయి ఏకంగా నాలుగు నుంచి ఆరు బౌన్సర్లు విసిరారు. ఒక స్పిన్ బౌలర్ అంత దగ్గరి నుంచి ప్రమాదకరమైన రీతిలో బౌన్సర్లు వేయడం చూసి క్రీజులో ఉన్న బ్యాటర్లతో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా ఇబ్బంది పడ్డారు.
ఈ వింత బౌలింగ్ యాక్షన్‌ను స్టాండ్స్ నుంచి గమనిస్తున్న సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన పక్కన ఉన్న వారితో “అసలు ఏం బౌలింగ్ చేస్తున్నాడు ఇతను? ఇది నిబంధనలకు విరుద్ధం కదా” అనే అర్థం వచ్చేలా చేతులూపుతూ అసంతృప్తిని వెళ్లగక్కారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో, నెటిజన్లు “ఇదేం బౌలింగ్ భయ్యా” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.
కృనాల్ పాండ్యా బౌలింగ్‌పై కావ్యమారన్ ఆగ్రహం..
Kavya Maran reaction to Krunal Pandya bowling action was priceless 😭😂
She didn’t look happy with it. That “yeh kya daal raha hai bhai?” expression was too funny 🤣 pic.twitter.com/WYPeU4Nbsj
— Rohan💫 (@rohann__45) May 22, 2026
ఆర్‌సీబీపై హైదరాబాద్ ఘన విజయం..
కృనాల్ పాండ్య తన విచిత్రమైన బౌలింగ్‌తో హైదరాబాద్ బ్యాటర్లను అడ్డుకోవాలని చూసినప్పటికీ, హోమ్ గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల జోరును ఆపడం ఎవరివల్లా కాలేదు. ఆ తర్వాత భారీ లక్ష్య చేదనతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ పవర్‌ప్లేలోనే వెనుతిరగడంతో ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. రజత్ పటిదార్, కృనాల్ పాండ్య, టిమ్ డేవిడ్ పోరాడినప్పటికీ లాభం లేకపోయింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 200 పరుగులకే పరిమితం కావడంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనలతో పాటు ఫ్రాంచైజీ యజమానుల హావభావాలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కావ్య మారన్ ఇచ్చే ఎమోషనల్ రియాక్షన్స్‌కు సోషల్ మీడియాలో ప్రత్యేక క్రేజ్ ఉంది. కృనాల్ పాండ్య బౌలింగ్ యాక్షన్‌పై ఆమె వ్యక్తం చేసిన నిరసన, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కొట్టిన ఫోర్‌కు ఆమె చప్పట్లు కొట్టి ఆనందించిన తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
