సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. దీనికి కారణం హైదరాబాద్ జట్టులో ఏదీ స్థిరంగా లేకపోవడమే. అంటే అస్థిరత. ఐపీఎల్ ఆరెంజ్ ఆర్మీగా పిలుచుకునే ఈ జట్టులో ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేపోతుంటారు. టీమ్ మేనేజ్‌మెంట్ తన ఆటగాళ్లపై చూడవలసిన నమ్మకాన్ని చూపించకపోవడమే దీనికి కారణం. IPL 2024లో కూడా ఇలాంటిదే జరిగింది. అక్కడ అంతా సవ్యంగా, సమతుల్యంగా అనిపించిన సమయంలో, మేనేజ్‌మెంట్ అకస్మాత్తుగా జట్టు కెప్టెన్‌ని మార్చడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ 2016లో ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ టైటిల్ గెలిచింది. అంతకుముందు 2009లో డెక్కన్ ఛార్జర్స్ (పేరు మార్చిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్) విజేతగా నిలిచింది. ఆ తర్వాత మరోసారి ట్రోఫిని దక్కించుకోలేకపోయింది. కాగా, ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది కొత్త కెప్టెన్ సారధ్యంలో హైదరాబాద్ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.