మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇరాన్ లొంగిపోయింది.. ఇరాన్‌పై ఇవాళ భీకరదాడులు చేస్తాంః డోనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు మరోసారి ఘాటైన హెచ్చరికలు చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇవాళ శనివారం (మార్చి 07) ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని ప్రకటించారు. తమ సరిహద్దు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పడంతోనే అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయన్నారు.

ఇరాన్‌కు మరోసారి ఘాటైన హెచ్చరికలు చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇవాళ శనివారం (మార్చి 07) ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని ప్రకటించారు. తమ సరిహద్దు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పడంతోనే అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయన్నారు. అమెరికా దాడులకు ఇరాన్ వణికిపోతుందన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ నాయకత్వం కూడా అదే రీతిలో స్పందించింది. దమ్ముంటే అమెరికా యుద్ద నౌకలు హర్మూజ్ జలసంధికి రావాలని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సవాల్ విసిరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ లొంగిపోకపోతే, ఈరోజు భారీ దాడి ప్రారంభిస్తామన్నారు. ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోని ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలు, జనావాసాలు లక్ష్యంగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రవర్తన కారణంగా, ఆ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేయడం, కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు తీవ్రంగా పరిశీలిస్తున్నామని ట్రంప్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇకపై ఆధిపత్య శక్తి కాదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఇప్పుడు ఓడిపోయే దేశంగా మారిందన్నారు. ఇరాన్ లొంగిపోయే వరకు, దాని పాలన పూర్తిగా బలహీనపడే వరకు దాడులు కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఈ మేరకు వెల్లడించారు.
ఈ సందర్భంగా, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చేసిన ప్రకటనను ట్రంప్ ప్రస్తావించారు. మధ్యప్రాచ్యంలోని తన పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పింది. తన పొరుగు దేశాలపై దాడి చేయదని పెజెష్కియాన్ అన్నారు. ఇరాన్‌పై దాడి చేయకపోతే తిరిగి దాడి చేయదని అన్నారు. దీనికి స్పందిస్తూ.. అమెరికా – ఇజ్రాయెల్ నుండి దాడి జరుగుతుండటంతో ఇరాన్ క్షమాపణలు చెప్పిందని ట్రంప్ అన్నారు. ఈ దాడుల ఒత్తిడి కారణంగా ఇరాన్ తన పొరుగువారికి క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు.
అమెరికాకు ఇరాన్ సవాల్..!
అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ నాయకత్వం కూడా అదే రీతిలో స్పందించింది. దమ్ముంటే అమెరికా యుద్ద నౌకలు హర్మూజ్ జలసంధికి రావాలని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సవాల్ విసిరారు. అంతుకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌కు ఆర్ధికసాయం కొనసాగిస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే, సరిహద్దు దేశాలపై దాడులు నిలిపివేస్తామని పెజెష్కియాన్ ప్రకటించారు.
ఇరాన్ యుద్ధం ఎంతకాలం ఉంటుంది?
ప్రస్తుతానికి ఈ యుద్ధం ముగిసే సూచనలు కనిపించడంలేవు. తాజాగా ట్రంప్ సర్కార్ ఇజ్రాయెల్‌కు 151 మిలియన్ డాలర్ల విలువైన కొత్త ఆయుధాల అమ్మకానికి ఆమోదం తెలిపింది. ఇరాన్ బేషరతుగా లొంగిపోయే వరకు అమెరికాతో చర్చలు జరపదని ట్రంప్ ప్రకటించారు. ఈ వారం పాటు జరిగిన సంఘర్షణలో ఇప్పటివరకు అత్యంత తీవ్రమైన బాంబు దాడి త్వరలో ప్రారంభమవుతుందని అమెరికా అధికారులు హెచ్చరించారు.
అయితే, పెజెష్కియాన్ ప్రకటన చేసిన గంటలోనే పరిస్థితి మళ్లీ తీవ్రమైంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి జరిగింది. ఇంకా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్‌లలో దాడులు జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. యునైటెడ్ స్టేట్స్ – ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్‌పై తరచుగా సైనిక దాడులు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ వివిధ మార్గాల్లో ప్రతీకారం తీర్చుకుంటోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
