ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన
ఒంగోలు జిల్లా మార్కాపురంలో పాఠశాల, ఆలయానికి సమీపంలో DSR బార్ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధం. దీనిపై విద్యార్థులు తీవ్రంగా నిరసన తెలిపారు. బార్ తొలగించే వరకు బడికి వెళ్లబోమని తరగతులు బహిష్కరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతో, విద్యార్థులే ధర్నా చేశారు. బార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్, పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఒకవైపు సరస్వతీ నిలయం.. మరోవైపు మద్యం దుకాణం! నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల, గుడికి సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు జిల్లా మార్కాపురం పట్టణంలో విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు. “మద్యం షాపును తొలగించే వరకు బడికి వెళ్లేది లేదు” అంటూ తరగతులను బహిష్కరించి విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలకు నిర్ణీత దూరంలో మద్యం దుకాణాలు ఉండాలి. అయితే, మార్కాపురంలో DSR పేరుతో వెలిసిన బార్ అండ్ రెస్టారెంట్ నేరుగా పాఠశాల మరియు రామాలయానికి సమీపంలోనే ఉండటం వివాదానికి దారి తీసింది. దీనివల్ల విద్యార్థులపై చెడు ప్రభావం పడుతుందని, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో విద్యార్థులే స్వయంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీసులకు, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తక్షణమే ఆ బార్‌ను అక్కడి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్
AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..
ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

