APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC తీపి కబురు అందించింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగే పరీక్షా దినాల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా, సమయానికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో 6.42 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ సౌకర్యం కల్పించబడింది.
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC తీపి కబురు చెప్పింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా, సమయానికి చేరుకునేందుకు వీలుగా ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా.. విద్యార్థులు తమ వద్ద ఉన్న పదో తరగతి హాల్ టికెట్‌ను బస్సు కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎటువంటి అదనపు పాస్‌లు లేదా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ వెసులుబాటు ఉంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పరీక్షా దినాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండీ ఈ మేరకు అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడపాలని, విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లవద్దని సిబ్బందికి సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..
ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

