త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ నటి త్రిష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే అంశం తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త సినిమాలకు సంతకాలు చేయకుండా, ఆమె విజయ్‌కు మద్దతుగా టీవీకే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే విజయ్‌తో కలిసి ఒక వేడుకలో కనిపించడం, ఆయన భార్య విడాకుల పిటిషన్ సమర్పించిన తర్వాత జరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.