ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అనూజ్ అగ్నిహోత్రి యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. గతంలో సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా ఎంపికైనా, ఐఏఎస్ లక్ష్యంగా నిరంతర కృషి చేసి ఈ అరుదైన విజయాన్ని సాధించారు. రావత్ భట కేంద్రీయ విద్యార్థి అయిన అనూజ్ కుటుంబంలోనే కాకుండా ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.