షూటింగ్‌లో బికినీ వేసుకోమన్న దర్శకుడు.. హీరోయిన్ చేసిన పనికి అంతా షాక్
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్. ఇప్పుడొస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. హీరోయిన్స్ కూడా రొమాంటిక్ సీన్స్ లోనూ నటించడానికి ఏ మాత్రం మొహమాటపడటం లేదు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో కనీసం లిప్ లాక్స్ లేకుండా సినిమాలు రావడం లేదు .

సినిమాల్లో హీరోయిన్స్ చాలా ముఖ్య పాత్ర పోస్తుంటారు. సినిమాలు హీరోయిన్స్ చాలా ముఖ్యం.. సినిమాలకు గ్లామర్ టచ్ హీరోయిన్సే.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు ముద్దుగుమ్మలు. కాగా సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు చేయడానికి వెనకాడరు. రీసెంట్ డేస్ లో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. కనీసం లిప్ లాక్ లేకుండా సినిమాలు ఉండటం లేదు. ఇప్పుడు బికినీ సీన్స్ కూడా చాలా కామన్ అయ్యాయి. కానీ ఒకానొక టైంలో బికినీ సీన్స్ అంటే అదొక పెద్ద విషయం.. సినిమాలో హీరోయిన్ బికినీలో కనిపించిందంటే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యేది. అయితే ఓ హీరోయిన్‌కు దర్శకుడు షూటింగ్‌లో బికినీ వేసుకోమని చెప్పాడట.. దాంతో ఆమె షాక్ అయ్యిందట. అయితే ఆమె బికినిలో కనిపించింది. అయితే బికినిలో కనిపించడానికి నిర్మాతల దగ్గర డబ్బులు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరంటే..
ప్రముఖ నిర్మాత డి.ఎస్. రావు, ప్రస్తుతం నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన సినీ ప్రయాణం, తన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రియమణి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ద్రోణ సినిమాలో ప్రియమణి బికినీ సన్నివేశంపై వచ్చిన వివాదాలపై డి.ఎస్. రావు స్పందించారు. 2009లోనే ప్రియమణి బికినీ వేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని పలువురు అడిగారని, అయితే వాస్తవానికి ఆ కథలో బికినీ సన్నివేశం లేదని తెలిపారు. కానీ దర్శకుడు కుమార్ వెళ్లి ఆ సన్నివేశం గురించి అడగ్గా, ప్రియమణి ఐదు నిమిషాల్లోనే క్యారవాన్‌కు వెళ్లి, తన తల్లికి తెలియజేసి వెంటనే సిద్ధమైందని వివరించారు.
ప్రియమణి ఈ సన్నివేశం కోసం ఎటువంటి అదనపు డబ్బులు అడగలేదని, తాను కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి స్పష్టం చేశానని డి.ఎస్. రావు పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రియమణి మార్కెట్‌లో మంచి స్థాయిలో ఉందని, ఆ బికినీ సన్నివేశం ద్రోణ సినిమాకి, హీరో నితిన్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అయిందని, సినిమా 27 కేంద్రాలలో 50 రోజులు ఆడిందని ఆయన వెల్లడించారు. గోకర్ణలోని ఒక ఐలాండ్‌లో సముద్రం మధ్య సెట్ వేసి, ఆ పాటను చిత్రీకరించినట్లు, దానికి చాలా కష్టపడినట్లు తెలిపారు నిర్మాత.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
